Weather Report: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఆ జిల్లాల్లో పిడుగులతో వానలు!

నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను వాయుగుండం బలపడి కొనసాగుతుంది. ఇది చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం బుధవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో వర్షాలు కురుస్తున్నాయి..

Weather Report: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఆ జిల్లాల్లో పిడుగులతో వానలు!
Andhra Pradesh Rains

Updated on: Dec 03, 2025 | 7:07 AM

అమరావతి, డిసెంబర్‌ 3: నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను వాయుగుండం బలపడి కొనసాగుతుంది. ఇది చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం బుధవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అదేవిధంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.

మంగళవారం తిరుపతి జిల్లా మల్లంలో 5.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నెల్లూరు జిల్లా తడ, చిత్తమూరులో 5, పూలతోటలో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. సముద్ర తీర ప్రాంత మండలాలైన చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేటలో 52 తీర గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాకాడులో సముద్రం దాదాపు 30 మీటర్లు ముందుకు వచ్చింది. దిత్వా తుపాను దిశను మార్చుకున్నప్పటికీ తమిళనాడులో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా ఈ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. వాయుగుండం బుధవారం పుదుచ్చేరి–మహాబలిపురానికి మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంది.

తెలంగాణలో స్వల్పంగా తగ్గిన చలి..

రాష్ట్రంలో మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి

ఇవి కూడా చదవండి
  • ఆదిలాబాద్.. 10.2
  • పటాన్ చెరువు.. 14.6
  • మెదక్.. 15.5
  • రాజేంద్ర నగర్.. 16
  • హనుమకొండ.. 16
  • నిజామాబాద్..16.1
  • నల్లగొండ.. 16.4
  • రామగుండం.. 17
  • హకింపేట్.. 17.5
  • హయత్ నగర్.. 17.6
  • దుండిగల్.. 17.7
  • హైదరాబాద్.. 18.3
  • ఖమ్మం.. 19.4
  • మహబూబ్ నగర్.. 19.6
  • భద్రాచలం.. 20.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరిన్నిఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.