Visakha Agency: ఆ తవ్వకాలు అందుకోసమేనా?.. విశాఖ ఏజెన్సీలో కలకలం సృష్టిస్తున్న గోతులు..

Visakha Agency: విశాఖ ఏజెన్సీ అనగానే.. ప్రకృతి సోయగాలు, కొండలు, కోనలు గుర్తుకు వస్తాయి. అలాంటి రమణీయ ప్రాంతాల్లో తవ్వకాలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి.

Visakha Agency: ఆ తవ్వకాలు అందుకోసమేనా?.. విశాఖ ఏజెన్సీలో కలకలం సృష్టిస్తున్న గోతులు..
Hidden Treasures

Updated on: Dec 28, 2021 | 7:00 PM

Visakha Agency: విశాఖ ఏజెన్సీ అనగానే.. ప్రకృతి సోయగాలు, కొండలు, కోనలు గుర్తుకు వస్తాయి. అలాంటి రమణీయ ప్రాంతాల్లో తవ్వకాలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ తవ్వకాలు అందుకోసమే చేశారా? అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ తవ్వకాలు ఎందుకు చేశారు? గోతులు తవ్విన దుండగులు ఎవరు? అనే సందేహాలను నివృత్తి చేసే పనిలో పడ్డారు పోలీసులు. వివరాల్లోకెళితే. అక్కడ కూడా అదే జరిగింది. గుప్తనిధుల కోసం ప్రచారం.. ఆలయాల్లో తవ్వకాలకు దారితీసింది. విశాఖ ఏజెన్సీలో పురాతన ఆలయాలు ఉన్నచోట తవ్వకాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. స్థానికుల్లో ఆందోళన రేపుతున్నాయి.

వివరాల్లోకెళితే.. విశాఖ ఏజెన్సీలో చింతపల్లి మండలం రోలంగిలోని పురాతన శంకులమ్మ ఆలయం వద్ద తవ్వకాలు జరిపారు దుండగులు. భారీ గోతులు తవ్వేశారు. ఎర్రబొమ్మలు పంచాయతీ రోలంగి గ్రామంలోని ఒకే చోట మూడు పురాతన ఆలయాలున్నాయి. వాటిలో శంకులమ్మ ఆలయం వద్ద గోతులు కనిపించాయి. దీంతో ఆందోళన చెందిన స్థానికులు ఆరా తీశారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు అంచనాకు వచ్చారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడడంతో అంతా వచ్చి ఆ గోతులను పరిశీలిస్తున్నారు.

తరతరాలుగా ఇక్కడ గ్రామ దేవతలైన దాసుడు, భూదేవి, శంకులమ్మల పురాతన విగ్రహాలను పూజిస్తూ వస్తున్నారు స్థానికులు. ఈ విగ్రహాల కింద భూభాగంలో గుప్తనిధులున్నాయని ప్రచారం జరగడంతో గుర్తుతెలియని వ్యక్తులు వీటికోసం తవ్వకాలకు పాల్పడుతున్నారు. గతంలోనూ పలుమార్లు వేర్వేరు ఆలయాల వద్ద తవ్వకాలు జరిగాయని అంటున్నారు గ్రామ సర్పంచ్ పండయ్య. గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధులకోసం తవ్వకాలు జరిపినట్లు గుర్తించామని చెప్పారు.

కాగా, పూర్వ కాలంలో రెడ్లు రోలంగి గ్రామంలో నివసించే వారట. వాళ్లు ఆలయాల సమీపంలో గుప్త నిధులు దాచినట్టుగా పుకార్లు షికారు చేశాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో.. దుండగులు వాటిపై కన్నేశారు. మూడో కంటికి తెలియకుండా అక్కడ అక్కడ తవ్వకాలు ప్రారంబించినట్టు స్థానికులు గుర్తించారు. తవ్వకాల కారణంగా ఆలయ గర్భంలో గోతులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగాయి. గుప్తనిధుల మాటేమోగానీ.. తవ్వకాల్లో ఏదో ఒకటి దుండగులు ఎత్తుకెళ్లే ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అధికారులు స్పందించి స్థానికుల ఆందోళనకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also read:

New Year Celebrations: మందుబాబులకు గుడ్ న్యూస్.. వైన్ షాప్స్, బార్లపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం..!

ESIC Recruitment 2021-22 : ఈఎస్ఐసిలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే..

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో దారుణం.. ప్రభుత్వ పథకాలు అందనీయడం లేదంటూ వ్యక్తి ఆత్మహత్య..