APSRTC: ఆర్టీసికి సంక్రాంతి కాంతులు.. ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందో తెలుసా..

|

Jan 18, 2023 | 6:21 AM

ఆర్టీసీకి సంక్రాంతి సిరులు కురిపించింది. పెద్ద పండుగకు అందరూ ఊరెళ్లడంతో.. బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. అంతే కాకుండా సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులతో అదనపు ఆదాయం లభించింది. ఈ ఏడాది సంక్రాంతికి...

APSRTC: ఆర్టీసికి సంక్రాంతి కాంతులు.. ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందో తెలుసా..
APSRTC
Follow us on

ఆర్టీసీకి సంక్రాంతి సిరులు కురిపించింది. పెద్ద పండుగకు అందరూ ఊరెళ్లడంతో.. బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. అంతే కాకుండా సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులతో అదనపు ఆదాయం లభించింది. ఈ ఏడాది సంక్రాంతికి ఏపీఎస్‌ ఆర్టీసీకి రూ. 141 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరమలరావు తెలిపారు. 1,483 ప్రత్యేక బస్సులు నడిపించడమే కాకుండా, జనవరి 6 వ తేదీ నుంచి 14వరకూ రికార్డు స్థాయిలో 3,392 బస్సులు నడిపారు. సాధారణ ఛార్జీలకే తగిన సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉండటంతో ఏపీఎస్‌ఆర్టీసి బస్సులకే అధిక ప్రాధానిమచ్చారు ప్రజలు. రాను-పోను టికెట్లపై బుక్‌ చేసుకున్న వారికి టిక్కెట్‌ చార్జీపై 10 శాతం రాయితీ ఇవ్వడం కూడా ఆదాయం రావడానికి కలిసొచ్చింది.

పెద్ద పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయినవాళ్ల మధ్య పండుగ జరుపుకోవాలనుకుంటారు. దీంతో స్వస్థలాలకు పయనమవుతుంటారు. వీరి అవసరాన్ని గమనించిన ఏపీఎస్ఆర్టీసీ.. పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపించింది. వివిధ రాయితీలు, ఆఫర్లతో జనాలను ఆకర్షించే ప్రయత్నాలు చేసింది. కాగా.. ఇవి సత్ఫలితాలు ఇచ్చాయి.

మరోవైపు.. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11 నుంచి 14 వరకు 1.21 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 11 నుంచి 14 వరకు 3,203 ప్రత్యేక బస్సులు నడిపించారు. సంక్రాంతికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..