Andhra Pradesh: మెడలో నగలు ఉంటే పెన్షన్ రాదట.. అది నమ్మిన వృద్ధురాలి పరిస్థితి ఏమైందంటే..

|

Dec 28, 2021 | 8:52 PM

Andhra Pradesh: కేటుగాళ్లు రోజు రోజుకు మరింత తెలివిమీరుతున్నారు. అమాయక ప్రజలను సునాయసంగా బురిడీ కొట్టిస్తూ.. అందిన కాడికి దోచుకుంటున్నారు.

Andhra Pradesh: మెడలో నగలు ఉంటే పెన్షన్ రాదట.. అది నమ్మిన వృద్ధురాలి పరిస్థితి ఏమైందంటే..
Follow us on

Andhra Pradesh: కేటుగాళ్లు రోజు రోజుకు మరింత తెలివిమీరుతున్నారు. అమాయక ప్రజలను సునాయసంగా బురిడీ కొట్టిస్తూ.. అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఓ వృద్ధురాలిని మాయ మాటలతో వంచించి నిలువునా దోచుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. వివరాల్లోకెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఓ వృద్ధురాలు బస్సు కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో కేటుగాటు ఆమె వద్దకు వచ్చి మాట కలిపాడు. తనకు తాను ప్రభుత్వ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. తాను గులుమూరు వీఆర్వోగా చెప్పుకున్నాడు. పెన్షన్, ఇతర సంక్షేమ పథకాల కోసం ఫోటోలు తీసుకోవాలని వృద్ధురాలిని నమ్మించాడు. అది నమ్మిన వృద్దురాలు.. ఫోటోలు దిగేందుకు సమ్మతం తెలిపింది. అయితే, బంగారు నగలు ఉంటే పెన్షన్ అందదని, ప్రభుత్వ పథకాలు వర్తించవని ఆమెను నమ్మించాడు. మెడలో, చెవులకు, ముక్కుకు ఉన్న నగలను తీయాలని చెప్పాడు.

మాయగాడి మాటలను విశ్వసించిన వృద్దురాలు.. మెడలో ఉన్న ఆభరణాలు, చెవి కమ్మలు, ముక్కు పుడక తీసి చీర కొంగులో దాచుకునే ప్రయత్నం చేసింది. అయితే, చీర కొంగులో దాచే క్రమంలో సాయం చేస్తున్నట్లు నటించిన కేటుగాడు.. అప్పటికే సిద్ధం చేసుకకున్న నకిలీ బంగారాన్ని ఆమె చీరకొంగులో కట్టాడు. కొద్దిపాటి సమయంలోనే.. అసలైన బంగారు ఆభరణాలను కాజేసి.. గిల్టు నగలను ఆమె కొంగులో కట్టాడు. అయితే, వృద్దురాలు ఇంటికి వెళ్లాక కొంగులో దాచిన బంగారు నగలను చూడగా.. నకిలీవి కనిపించాయి. దాంతో ఆమె షాక్ అయ్యింది. తాను చోరీకి గురయ్యానని గ్రహించి.. పోలీసులను ఆశ్రయించింది. జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, పరిచయం వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచించారు.

Also read:

Hair Care Tips: ఉప్పు నీటి కారణంగా మీ జుట్టు రాలిపోతుందా? అయితే ఇలా చేయండి..

Visakha Agency: ఆ తవ్వకాలు అందుకోసమేనా?.. విశాఖ ఏజెన్సీలో కలకలం సృష్టిస్తున్న గోతులు..

New Year Celebrations: మందుబాబులకు గుడ్ న్యూస్.. వైన్ షాప్స్, బార్లపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం..!