AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LED TV: రూ.500లకే ఎల్‌ఈడీ టీవీ.. అసలు విషయం తెలిసి షాకైన స్థానికులు.. పోలీసులకు సమాచారం

LED TV: ఇప్పుడున్న రోజుల్లో ఎల్‌ఈడీ టీవీ కొనాలంటే తక్కువంటే తక్కువ రూ.12 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ధర ఉంటాయి. ఇక మధ్య తరగతి కుటుంబమైతే ఓ రూ. 20 వేల నుంచి...

LED TV: రూ.500లకే ఎల్‌ఈడీ టీవీ.. అసలు విషయం తెలిసి షాకైన స్థానికులు.. పోలీసులకు సమాచారం
Follow us
Subhash Goud

|

Updated on: Mar 02, 2021 | 1:34 AM

LED TV: ఇప్పుడున్న రోజుల్లో ఎల్‌ఈడీ టీవీ కొనాలంటే తక్కువంటే తక్కువ రూ.12 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ధర ఉంటాయి. ఇక మధ్య తరగతి కుటుంబమైతే ఓ రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు కొనుగోలు చేస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో ఎంఐ కంపెనీలు లాంటివి అతి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చాయి. కానీ ఇక్కడ మాత్రం రూ.500లకే టీవీ వస్తుందంటే నమ్ముతారా..? అవును నిజమే.. అది కృష్ణా జిల్లాలోని ఓ దొంగల ముఠా రూ.500లకే అమ్ముతున్న టీవీలు అవి. ఇంత తక్కువ ధరకే వారు బేరం పెట్టారు. ఎంత దొంగతనంగా కొట్టుకొచ్చిన టీవీలైనా.. కేవలం రూ.500లకే అమ్మడమేంటని అనుకుంటున్నారా..? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులో సోనోవిజన్ షో రూమ్‌ ఉంది. అక్కడి నుంచి భీమవరానికి ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్‌ మెషన్లు ఓ మినీ వ్యాన్‌లో లోడ్‌ చేశారు. అయితే ఈ వ్యాన్‌పై యూపీకి చెందిన ఓ దొంగల ముఠా కన్నేసింది. ఇంకేముంది వెంటనే చాకచక్యంగా చోరీ చేసేశారు. వ్యాన్‌ను ఎవరికి అనుమానం రాకుండా ఎనికేపాడు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌ వెళ్లిపోవాలని మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. అయితే మార్గమధ్యలో కథ అడ్డం తిరిగింది. వ్యాన్‌లో డీజిల్‌ అయిపోయింది. చేతిలో డబ్బులు లేవు. వ్యాన్‌లో చూస్తే లక్షలాది రూపాయల ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఉన్నాయి. దీంతో చేసేదేమి లేక డీజిల్‌ డబ్బుల కోసం ఎల్‌ఈడీ టీవీనీ రూ.500లకు బేరం పెట్టారు. ఇలా బేరం పెట్టడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇంకేముంది ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారిని పట్టుకున్నారు. చోరీ చేసిన ఎలక్ట్రానిక్‌ వస్తువుల విలువ రూ.9 లక్షల వరకు ఉంటుంది. వాటిని స్వాధీనం చేసుకుని.. దొంగల ముఠా సమాచారం మేరకు సదరు సోనోవిజన్‌ యజమాన్యానికి సమాచారం అందించారు.

లక్షలాది విలువ చేసే ఎలక్ట్రానిక్‌ వస్తువులు దొరకడంతో షోరూమ్‌ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. అయితే భారీ ప్లాన్‌ వేసి పట్టపగలే దొంగతనం చేసిన యూపీ ముఠా… డీజిల్‌కు డబ్బులు లేక అడ్డంగా దొరికిపోయారు.

ఇవి చదవండి:

Fire Accident: అగ్ని ప్రమాదం జరిగి 24 గంటలు గడవకముందే మరో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు భవనంపైకి దూకి..

తప్పతాగిన చిందులేసిన ఉపాధ్యాయుడు.. వీడియో వైరల్‌తో చర్యలు.. టీచర్‌తో సహా ముగ్గురిపై వేటు..!