జనావాసాల మధ్య తిరిగే పశువులకు ఓ గుంత నరకాన్ని చూపిస్తోంది. ఆహారం కోసం సంచరించే ఆవులు, దూడలు ఆ గుంతలో పడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నాయి. ప్రతిసారి ఎవరో ఒకరు చూసి వాటిని ఆ గుంత నుంచి సురక్షితంగా బయటకు తీయాల్సి వస్తోంది. ఓ ఇంటి నిర్మాణంలో భాగంగా తవ్విన సెప్టిక్ ట్యాంక్ రోడ్డుపక్కనే ఉంది. దాని పక్కనే చెట్లు మొలిచి ఉండటంతో ఆ చెట్ల ఆకులను తినేందుకు వస్తున్న మూగజీవాలు ప్రమాదవశాత్తూ ఆ సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోతున్నాయి. దీంతో వాటిని రక్షించేందుకు ఇటు కాలనీవాసులు, అటు ఫైర్ సిబ్బంది నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ ట్యాంక్‌పై మూత వేయండి మహాప్రభో అంటూ ఆ స్థల యజమానిని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రాజ్యలక్ష్మీ కాలనీ లేడీస్ హాస్టల్ వద్ద నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో రాత్రి ప్రమాదవశాత్తు ఓ దూడ పడిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు అరగంటకు పైగా శ్రమించి ఆ లేగ దూడను గుంతలో నుంచి వెలికి తీశారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఓ ఆవు కూడా ఇలానే పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఇంటి యజమాని చాలా రోజులుగా నిర్మాణం పూర్తి చేయకుండా ఇలానే ఉంచడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవు దూడను రక్షించిన అగ్నిమాపక శాఖ అధికారులను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.
ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..