Fact Check: శరన్నవరాత్రి వేళ దుర్గ గుడికి వైసీపీ జెండా రంగులతో అలంకరణ..? నిజం ఏంటో తేల్చి చెప్పిన ఏపీ సర్కారు.

|

Oct 07, 2021 | 6:22 PM

Fact Check: ఇటీవల సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలకు కేంద్రంగా మారుతోంది. టెక్నాలజీని ఆసరగా చేసుకొని కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి వదులుతున్నారు. ఈ కారణంగా ప్రజల్లో గందరగోళానికి..

Fact Check: శరన్నవరాత్రి వేళ దుర్గ గుడికి వైసీపీ జెండా రంగులతో అలంకరణ..? నిజం ఏంటో తేల్చి చెప్పిన ఏపీ సర్కారు.
Follow us on

Fact Check: ఇటీవల సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలకు కేంద్రంగా మారుతోంది. టెక్నాలజీని ఆసరగా చేసుకొని కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి వదులుతున్నారు. ఈ కారణంగా ప్రజల్లో గందరగోళానికి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జగనన్న విద్యా కానుకలో భాగంగా విద్యార్థులకు ఇచ్చిన డిక్షనరీలో ‘దేవుడు’ అర్థాన్ని మార్చిందంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారం ఎంతకీ ఆగకపోవడంతో ఏపీ ప్రభుత్వమే నేరుగా ప్రకటన చేయాల్సి వచ్చింది. మార్కెట్లో లభించే డిక్షనరిలో, ప్రభుత్వం ఇచ్చిన డిక్షనరిలో ఒకే రకమైన అర్థం ఉందంటూ ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ పేరిట వివరణ ఇచ్చింది.

అయితే ఈ విషయం మర్చిపోక ముందే ఇప్పుడు మరో అంశం తెర మీదికి వచ్చింది. తాజాగా గురువారం దేవి శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడ కనకదుర్గ గుడిలో పూజలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఈ క్రమంలోనే కొందరు దేవలయాన్ని వైసీపీ రంగులతో అలంకరించారని ఫేక్‌ వార్తను వైరల్‌ చేశారు. దీంతో వైసీపీ జెండా రంగులతో ఉన్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ విషయంపై ప్రభుత్వం అధికారికంగా స్పందించింది.

#FactCheck

గుడి అలంకరణకు సంబంధించిన వాస్తవ వీడియోను జతచేస్తూ.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఆ స్క్రీన్‌ షాట్‌ను నమ్మవద్దని కోరింది. వీడియోలో వైసీపీ రంగులు లేకపోగా స్క్రీన్ షాట్ లో వైసీపీ జెండా రంగును పోలినట్లు ఫేక్ ఫోటోను వైరల్ చేసినట్లు తేల్చేశారు.  వీటితో పాటు..’సత్యంతో కూడిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగకు సంబంధించి.. ఫేక్‌ కంటెంట్‌ను తనిఖీ చేయమని మాకు అభ్యర్థనలు రావడం నిరుత్సాహపరిచింది. ఇలాంటి ఫేక్‌ కంటెంట్‌ను ఫార్వర్డ్‌ చేసే సమయంలో ప్రజలంతా అప్రమత్తతో ఉండాలని కోరుకుంటున్నాము’ అంటూ రాసుకొచ్చారు.

అంతేకాకుండా ‘దుర్గమ్మ దయవల్ల ఎప్పటికీ సత్యమే గెలుస్తుంది. మీకు ఎప్పుడైనా తప్పుడు సమాచారంతో కూడిన స్క్రీన్‌ షాట్స్‌ వస్తే.. నిజానిజాలను తెలుసుకునే క్రమంలో దాని మూలాలకు సంబంధించిన వీడియోను గమనించండి’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read: Passenger Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు

MAA Elections 2021: ఓటేసాకే షూటింగ్‌లకు రండి.. ఆర్టిస్ట్‌లకు నిర్మాత మండలి విజ్ఞప్తి..

East Godavari: దేవుడి ఫోటోలు చూసి దండం పెట్టుకునేరు.. తెరిచి చూస్తే పోలీసులకే కళ్లు బైర్లుగమ్మాయి