Breaking: సస్పెన్స్‌కు తెర.. ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా.. ఏపీ ప్రభుత్వం ప్రకటన..

|

May 27, 2021 | 12:38 PM

AP Tenth Exams: సస్పెన్స్‌కు తెరపడింది. ఏపీలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. జూలైలో మరోసారి సమీక్ష జరిపి..

Breaking: సస్పెన్స్‌కు తెర.. ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా.. ఏపీ ప్రభుత్వం ప్రకటన..
Students
Follow us on

AP Tenth Exams: సస్పెన్స్‌కు తెరపడింది. ఏపీలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. జూలైలో మరోసారి సమీక్ష జరిపి.. అప్పటి పరిస్థితుల బట్టి పరీక్షలపై తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వాస్తవానికి పదో తరగతి పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటిదాకా షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చినా.. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో తాజాగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే టెన్త్ పరీక్షలపై హైకోర్టు విచారణ చేపట్టగా.. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీనితో పది పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం న్యాయస్థానానికి వివరించింది. ప్రస్తుతానికి స్కూల్స్ తెరిచే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. టీచర్లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించలేదంటూ ప్రభుత్వం ఆఫిడివిట్ దాఖలు చేయగా.. పూర్తి వివరాలు కోరుతూ హైకోర్టు తదుపరి విచారణను జూన్ 18వ తేదీకి వాయిదా వేసింది.

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!