Andhra: చలి గడ్డకట్టడం ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో మీకోసమే

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి గజగజ వణికిస్తోంది. గత రెండు మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్స్ కు పడిపోతున్నాయి ఉష్ణోగ్రతలు. పెరిగిన చలి తీవ్రత పొగ మంచుతో.. పలుచోట్ల గాజు ముక్కలా మంచు పేరుకు పోతోంది. ఆ వివరాలు..

Andhra: చలి గడ్డకట్టడం ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో మీకోసమే
Cold

Edited By: Ravi Kiran

Updated on: Dec 12, 2025 | 12:29 PM

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ గడ్డకట్టుకుపోతోంది. గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్స్ కు పడిపోతున్నాయి . పెరిగిన చలి తీవ్రత పొగ మంచుతో.. పలుచోట్ల గాజు ముక్కలా మంచు పేరుకు పోతోంది. పాడేరు మండలం సంగోడి పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో మంచు మేటలు కనిపిస్తున్నాయి. జి మాడుగుల సొలభం, గడుతూరు, లోచలి లోనూ గడ్డకట్టిన మంచు దృశ్యాలు కనిపిస్తున్నాయి. వరి నూర్పులపై వేసిన టార్పాలిన్లు మంచుతో నిండిపోతున్నాయి. పొలం పనులకు వెళ్లిన గిరిజన రైతులు గజగజ వణికి పోతున్నారు. మంచు గడ్డలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంచు పేరుకుపోయిన పొలాల్లలో పనులు చేయలేక కొందరు వెనుదిరుగుతున్నారు. ఉత్తరాది నుంచి వేస్తున్న గాలులే ఈ పరిస్థితిక కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఏజెన్సీలో ఓవైపు సింగిల్‌ డిజిట్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు…మరోవైపు దట్టంగా అలముకుంటున్న పొగమంచుతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటలైనా మంచుతెరలు వీడటంలేదు. శుక్రవారం మినుములూరు, అరకులో 4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరులో 6, చింతపల్లి 5.2 డిగ్రీల ఉష్ణగ్రత రికార్డ్ అయింది. చలికి తట్టుకోలేక చలి మంటలు వేసుకుంటున్నారు ప్రజలు. ఉదయం పదిగంటలైనా పొగమంచు వీడకపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక.. వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చేయండి