TDP Mahanadu: రాజమండ్రి వేదికగా పసుపు పండగ.. తెలుగుదేశం మహానాడు ఎప్పుడంటే..?

|

May 11, 2023 | 9:34 PM

రాజమండ్రి వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు జరగబోతోంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్నమహానాడుకు సంబంధించి 15 కమిటీలను నియమించింది టీడీపీ అధిష్టానం. ప్రతి కమిటీలోనూ తెలంగాణ టీడీపీ నేతలకు ప్రాధాన్యం కల్పించింది.

TDP Mahanadu: రాజమండ్రి వేదికగా పసుపు పండగ.. తెలుగుదేశం మహానాడు ఎప్పుడంటే..?
Tdp Mahanadu
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అన్ని పార్టీలూ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో ప్రతి కార్యక్రమాన్ని ఆయా పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ పండుగలా భావించే మహానాడును మరింత ప్రెస్టేజియస్‌గా భావిస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో మరింత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రి వేదికగా జరగబోతోన్న టీడీపీ మహానాడుకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. టీడీపీ మహానాడు నిర్వహణ, నిర్ణయాలు, తీర్మానాలపై కమిటీలు వేసింది ఆ పార్టీ అధిష్టానం. మొత్తం 15 కమిటీలను అధిష్టానం నియమించింది. తీర్మానాల కమిటీలో యనమల సహా 14 మంది సీనియర్‌ నేతలు ఉన్నారు.

అలాగే.. ప్రతి కమిటీలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యం కల్పించారు. ఇక.. వంద ఎకరాల స్థలంలో మహానాడు నిర్వహిస్తోంది టీడీపీ. ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు జరగనుండటంతో మహానాడుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల పట్టభద్రులు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా వరుస విజయాలు సాధించి టీడీపీ జోష్‌లో ఉంది. దాంతోపాటు.. ఓవైపు నారా లోకేశ్‌ పాదయాత్ర చేస్తుండగా.. ఇంకోవైపు.. చంద్రబాబు కూడా వివిధ అంశాలపై జిల్లాల వారీగా పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో.. 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడు నుంచే ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉంది. మహానాడు ద్వారా పలు కీలక అంశాలపై టీడీపీ అధినేత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలకు సంబంధించిన టీడీపీ మేనిఫెస్టోపైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తులపైనా జోరుగా ప్రచారం నడుస్తుండగా.. వాటిపైనా ఓ స్పష్టత రానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..