విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కోనుగోలు చేసే క్రమంలో.. జయేశ్ రంజన్ నేతృత్వంలో బిడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బిడ్డింగ్‌కు ప్రణాళికలు చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాన్ విషయంలో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. సింగరేణి కాలరీస్ జాయింట్ వెంచర్ కింద ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆలోచన చేస్తోంది. దానిలో భాగంగా.. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లారు. స్టీల్‌ప్లాంట్ సీఎండీ లేకపోవడంతో.. మార్కెటింగ్ సీజేఎం సత్యానందంతో భేటీకానున్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు.
ఇప్పటికే.. తెలంగాణలో సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకించిన బీఆర్ఎస్.. ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోంది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.. కార్మికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఓ వైపు కార్మికులు ఉద్యమాలు చేస్తుండగా.. కేంద్రం మాత్రం విక్రయించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అయితే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు బిడ్డింగ్‌లో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..