AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: ప్రశ్నాపత్రాలు కరెక్ట్ చేస్తుండగా.. విద్యార్ధి రాసిన ఆన్సర్ చూసి ఫ్యూజులౌట్.!

పరీక్షల్లో ప్రశ్నకు సరైన సమాధానం తెలయకపోతే ఏదో ఒకటి రాసి రావడం విద్యార్ధులకు సర్వసాధారణమైపోయింది. అయితే 70 మార్కులుపైగా వచ్చిన ఓ విద్యార్ధి ఒక ప్రశ్నకు రాసిన జవాబును చూసి ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు. అరకొర మార్కులతో పాస్సయ్యే విద్యార్ధులు..

Guntur: ప్రశ్నాపత్రాలు కరెక్ట్ చేస్తుండగా.. విద్యార్ధి రాసిన ఆన్సర్ చూసి ఫ్యూజులౌట్.!
Representative Image
T Nagaraju
| Edited By: |

Updated on: Apr 10, 2024 | 7:49 PM

Share

పరీక్షల్లో ప్రశ్నకు సరైన సమాధానం తెలయకపోతే ఏదో ఒకటి రాసి రావడం విద్యార్ధులకు సర్వసాధారణమైపోయింది. అయితే 70 మార్కులుపైగా వచ్చిన ఓ విద్యార్ధి ఒక ప్రశ్నకు రాసిన జవాబును చూసి ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు. అరకొర మార్కులతో పాస్సయ్యే విద్యార్ధులు రాసే రాతలు చూసి టీచర్లు నవ్వుకోవడం పరిపాటి.. కాని 70కి పైగా మార్కులు వస్తున్నా.. ఇలాంటి రాతలు ఆ విద్యార్ధి ఎందుకు రాశాడో అర్ధంకాక ఉపాధ్యాయులంతా తలలు పట్టుకున్నారు.

వివరాల్లోకెళ్తే.. అది బాపట్ల జిల్లాలోని స్థానిక మున్సిపల్ హైస్కూల్. పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. తెలుగు పేపర్లను టీచర్లు దిద్దుతున్నారు. అందులోని ఒక ప్రశ్న. రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి.? ఇందుకు ఆ విద్యార్ధి రాసిన జవాబు చూసి ఒక్కసారిగా ఆ టీచర్ ఆశ్చర్యపోయాడు. నాకు మార్కులు వేయకుంటే మా తాత చేత చేతబడి చేయిస్తా అని రాసి ఉండటాన్ని చూసిన ఉపాధ్యాయుడు.. దెబ్బకు మూల్యాంకనం చేయడం నిలిపి వేసి వెంటనే ఆ జవాబు పత్రాన్ని ఉన్నతాధికారులకు చూపించాడు. పేపరు మొత్తాన్ని పరిశీలించిన అధికారులు మరొక చోట రాసి ఉన్న జవాబు చూసి మరింత విస్తుపోయారు.

మరొక చోట ‘మంధర శివాజీ మహరాజ్‌ను తీసుకొని దండకారణ్యానికి వెళ్లింది’ అని రాసి ఉండటాన్ని గమనించారు. దీంతో అప్పటివరకు అసలు ఎన్ని మార్కులకు జవాబులు రాశాడు.? ఎన్ని మార్కుల వచ్చాయో పరిశీలించారు. అయితే ఆ విద్యార్దికి అప్పటికే 70 మార్కులు రావడం చూసి మరింతగా ఆశ్చర్యపోయారు. ఇన్ని మార్కులు వచ్చినా.. ఆ విద్యార్ధి మాత్రం ఇలాంటి జవాబులు ఎందుకని రాశాడో తెలియక టీచర్లు తికమకపడ్డారు. కాగా, విద్యార్ధి రాసిన జవాబులు చూసి మున్సిపల్ హైస్కూల్‌లోని కొందరు టీచర్లు నవ్వుకుంటే.. మరికొంతమంది విస్తుపోయారు.

Follow Us
ధీరజ్ పొరపాటు.. ప్రేమ మనసుకు మరో గాయం.. ఇక దూరమే..
ధీరజ్ పొరపాటు.. ప్రేమ మనసుకు మరో గాయం.. ఇక దూరమే..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే