Mangalagiri: ఇప్పట్లో ఎన్నికలు లేవు.. అయితేనేం, ఎత్తులు పైఎత్తులతో హీటెక్కిన మంగళగిరి.. కారణమేమంటే..?

|

Dec 09, 2021 | 3:14 PM

పోయిన చోటే వెతుక్కోమంటారు పెద్దలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అదే చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చితకిలాపడ్డ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు క్షేత్రస్థాయి నుంచే రిపేర్ చేసే పనిలో పడ్డారు అగ్రనేతలు.

Mangalagiri: ఇప్పట్లో ఎన్నికలు లేవు.. అయితేనేం, ఎత్తులు పైఎత్తులతో హీటెక్కిన మంగళగిరి.. కారణమేమంటే..?
Nara Lokesh
Follow us on

TDP vs YSRCP in Mangalagiri: పోయిన చోటే వెతుక్కోమంటారు పెద్దలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అదే చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చితకిలాపడ్డ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు క్షేత్రస్థాయి నుంచే రిపేర్ చేసే పనిలో పడ్డారు అగ్రనేతలు. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటనలపై అదే ప్రత్యర్థులు అదే అంటున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటి చేసిన లోకేష్ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో అనుహ్యంగా ఓటమిపాలయ్యారు.

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో ఓడిపోవడం, రాజధాని నియోజకవర్గంలో ఓడిపోవటంతో లోకేష్ పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమం‌లోనే ఆయన వచ్చే ఎన్నికల్లో వేరే చోట నుండి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతం లోకేష్ మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓటమి తర్వాత మరింత ఎక్కువుగా లోకేష్ పర్యటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా లోకేష్ మంగళగిరిలోనే పోటీ చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు. అక్కడ నుండి గెలుపే ధ్యేయంగా లోకేష్ పని చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. గత నెల రోజుల పరిధిలో రెండోసారి తాడేపల్లి మండలంలో లోకేష్ అభిమానులను, నేతలను కలుస్తున్నారు. రెండు వారాల క్రితం మంగళగిరి, దుగ్గిరాల మండలాల్లో పర్యటించారు.

మరోవైపు, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత మరోసారి ఆ పార్టీ మంగళగిరి నియోజకవర్గంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఒకవేళ లోకేష్ పోటీ చేస్తే ఓడించేందుకు ఇప్పటి నుండే ప్రణాళిక రచిస్తోంది. ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కూడా ఊతమిస్తోంది. మంగళగిరిలో పద్మశాలీలు (చేనేత వర్గం) సామాజిక ఓటర్లు అధికంగా ఉంటారు. మంగళగిరి నుండి ఎవరూ గెలవాలన్న వారి మద్దతు అవసరం. ఇందులో భాగంగానే చేనేత వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇస్తారని భావించిన తరుణంలో అనూహ్యంగా మురుగుడుని ఎంపిక చేశారు. ఇది ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేష్ మరోసారి పోటీ చేసిన ఓడించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద రెండున్నర ఏళ్ళ ముందే మంగళగిరి నియోజకవర్గం హాట్ టాపిక్ మారింది. రెండు ప్రధాన పార్టీల ఎత్తుల పైఎత్తులకు మంగళగిరి వేదికైంది.

Read Also….  Sanjay Dutt: ఆ టాలీవుడ్ స్టార్ హీరో మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్.. ఏ సినిమాలో అంటే..