AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Babu: డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై చంద్రబాబు కన్నెర్ర.. కళా వెంకట్రావు చేసిన తప్పేంటి అంటూ నిలదీత..

Chandra Babu: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్మాది పాలన నడుస్తోందని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.

Chandra Babu: డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై చంద్రబాబు కన్నెర్ర.. కళా వెంకట్రావు చేసిన తప్పేంటి అంటూ నిలదీత..
Shiva Prajapati
|

Updated on: Jan 21, 2021 | 11:20 AM

Share

Chandra Babu: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్మాది పాలన నడుస్తోందని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గురువారం నాడు ఆయన మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ నేత కళా వెంకట్రావు అరెస్ట్, టీడీపీ చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతి నిరాకరణ వంటి అంశాలపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ టార్గెట్‌గా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కళా వెంకట్రావు చేసిన తప్పేంటని డీజీపీని చంద్రబాబు ప్రశ్నించారు. శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పడం నేరమా? అని నిలదీశారు. రాష్ట్రంలో అమలు చేసేది ఇండియన్ పీనల్ కోడా? జగన్ పీనల్ కోడా? అని ధ్వజమెత్తారు. రాత్రి సమయంలో కళా వెంకట్రావును కనీసం టాబ్లెట్ కూడా వేసుకోనివ్వకుడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారని భగ్గుమన్నారు. ఇకపై మీ ఆటలు సాగవంటూ పోలీసులపై చంద్రబాబు కన్నెర్ర చేశారు.

ఇక రామతీర్థం వెళ్లినప్పుడు ప్రతిపక్ష నేతగా తనకు అనుమతి ఇచ్చి.. అదే సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డికి ఎలా అనుమతి ఇస్తారు? అని డీజీపీని చంద్రబాబు నిలదీశారు. తాను రామతీర్థం వెళ్తుంటే లారీలు అడ్డుపెట్టి అడుగడుగునా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. అదే విజయసాయిరెడ్డిని దగ్గరుండి మరీ తీసుకెళ్లారంటూ ఫైర్ అయ్యారు.

ఇదే సమయంలో తిరుపతి వేదికగా టీడీపీ చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతి నిరాకరించడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మ పరిరక్షణ కార్యక్రమానికి మొదట అనుమతి ఇచ్చి ఇప్పుడు నిరాకరించడం ఏంటని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసుల తీరుపై చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ఏం తమాషా చేస్తున్నారా? చరిత్ర హీనులుగా మిగిలిపోతారు’ అంటూ పోలీసులపై బాబు చండ్ర నిప్పులు కక్కారు. తన మీద క్రిస్టియన్ సంఘాల చేత విమర్శలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని, అయినా రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని దుయ్యబట్టారు.

Also read:

దుర్గగుడి వెండి సింహాల చోరీ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో కీలక నిందితుడితో సహా బంగారం వ్యాపారి?

Delhi CM Arvind Kejriwal: ఢిల్లీలో కోటి దాటిన కరోనా టెస్టులు… ట్వీట్ చేసిన సీఎం…