Nara Lokesh: జంగారెడ్డిగూడెం ఘటన నేపథ్యంలో టిడిపి నేత నారా లోకేష్ ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. నిన్న (మంగళవారం) గుంటూరు జిల్లా(Guntur District)లో కల్తీ సారా తాగి ఒకరు మరణించారు.. ఇది కూడా సహజ మరణం అంటారా అంటూ ప్రశ్నించారు. కల్తీసారా మరణాలపై అసెంబ్లీలో చర్చ నుంచి ఎందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీల ప్రోత్సాహంతోనే నాటుసారా తయారవుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఈ ఘటన ను సీరియస్ గా తీసుకోవడం లేదని..తక్షణమే ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని లోకేష్ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై సభాహక్కుల నోటీస్ ఇచ్చాము. ముఖ్యమంత్రి ఎందుకు పారిపోతున్నారు. కొందరు కల్తీ సారా తాగి చనిపోయారని ఓ మంత్రి అంటున్నారు.. అయితే ముఖ్యమంత్రి సహజ మరణాలు అంటున్నారు.. ఇందులో ఏది నిజమన్నారు. సహజ మరణాలు అయితే ఎఫ్ ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేశారన్నారు లోకేష్.
పుష్కరాలు అనేది యాక్సిడెంట్. ఇపుడు ప్రభుత్వం నిర్లక్ష్యం, కల్తీ సారాతో మరణించారు. ఎల్జీ పాలిమర్స్ మృతుల కు కోటి ఇచ్చారు. ఇపుడు కనీసం బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి పరామర్శించలేదు. అసలు ఆయనకు మానవత్వం ఉందా ఎంతమంది చనిపోతే స్పందిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము సీరియస్ గా ఆందోళన చేస్తుంటే.. మంత్రులు సభలో జోకులు వేసుకుని నవ్వుతున్నారని చెప్పారు లోకేష్.
ఇదే విషయంపై మరో టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి స్పందిస్తూ.. సారా మరణాలపై సభలో చర్చించాలని కోరాము. కనీసం జవాబు చెప్పే పరిస్థితి కూడా ప్రభుత్వం లేదని అన్నారు. అందుకనే భయపడి ప్రభుత్వం పారిపోతోంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా నాటుసారా ఉందని గతంలో స్పీకర్ తెలిపారు. సహజ మరణాలని సీఎం చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం లో మూడు రోజుల్లో 33 కేసులు పెట్టి..22 మందిని అరెస్ట్ చేసామని ఎస్ ఈబి ప్రకటన ఇచ్చిందని అన్నారు దీపక్ రెడ్డి
Also Read: