Nara Lokesh: తిరుపతిలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర.. భవన నిర్మాణ కార్మికులతో సమావేశం

ఈ రోజు లోకేష్ పాదయాత్ర ఆర్టీసీ బస్టాండు , అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహం, రైల్వే స్టేషన్ మీదుగా కృష్ణాపురం టాణా ఎన్టీఆర్ సర్కిల్ బాలాజీ కాలనీ మీరుగా కొనసాగనుంది. ఈ రోజు రాత్రి చంద్రగిరి నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ఎంట్రీ ఇవ్వనుంది.

Nara Lokesh: తిరుపతిలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర.. భవన నిర్మాణ కార్మికులతో సమావేశం
Nara Lokesh Padayatra

Updated on: Feb 25, 2023 | 8:15 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఏపీలో కొనసాగుతోంది. యువగళం పాదయాత్రలో భాగంగా 27 వ రోజు తిరుపతి జిల్లాలోని లోకేష్ పాదయాత్ర  కొనసాగుతుంది. యువగళం పాదయాత్రలో భాగంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులతో లోకేష్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భవన నిర్మాణ కార్మికులతో సమావేశం కానున్నారు. అనంతరం అక్కడే లంచ్ బ్రేక్ తీసుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు.

ఈ రోజు లోకేష్ పాదయాత్ర ఆర్టీసీ బస్టాండు , అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహం, రైల్వే స్టేషన్ మీదుగా కృష్ణాపురం టాణా ఎన్టీఆర్ సర్కిల్ బాలాజీ కాలనీ మీరుగా కొనసాగనుంది. ఈ రోజు రాత్రి చంద్రగిరి నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ఎంట్రీ ఇవ్వనుంది. రాత్రి అక్కడే బస చేయనున్నారు.

 

ఇవి కూడా చదవండి

ఏపీలో ప్రజల కష్టలను స్తానిక పరిస్థితులను తెలుసుకునేందుకు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 400 రోజులు పాటు, 4వేల కిలో మీటర్లు సాగనుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు జిల్లా వరకు చేయనున్నారు. అయితే ఇప్పటి వరకూ లోకేష్ పాద యాత్ర ఇప్పటి వరకు 344.6 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..