Lokesh Letter To jagan: కరోనా కారణంగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. కరోనా వేళ పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒకచోట చేరితే వైరస్ విజృంభించే అవకాశాలున్నాయన్న కారణంగా ప్రభుత్వాలు పరీక్షలను వాయిదా వేశాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసిన విషయం విధితమే. నిజానికి తొలుత ఏపీలో పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం భావించినా సుప్రీం ఆదేశాల మేరకు పరీక్షలను రద్దు చేసింది. ఇక ఆ సమయంలో టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు అయిన తర్వాత ఇప్పుడు మళ్లీ అందరి దృష్టి డిగ్రీ పరీక్షల నిర్వహణపై పడింది. ఈ క్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నారా లోకేష్ లేఖను రాశారు. ఇందులో భాగంగా ఆయన 17 లక్షల మంది విద్యార్థుల భద్రతపై దృష్ట సారించాలని కోరారు. సెమిస్టర్ పరీక్షల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సెమిస్టర్ పరీక్షలు దగ్గరపడుతోన్న వేళ విద్యార్థుల ఆరోగ్యాలను, భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో సెమిస్టర్ పరీక్షల నిర్వహణ చాలా కీలకం అయినప్పటికీ.. లక్షల మందికి ఒకేసారి పరీక్షల నిర్వహణ చాలా ప్రమాదమని లోకేష్ అభిప్రాయపడ్డారు. కాబట్టి దీనిపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాలని సూచించారు.
డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలను నిర్వహించొద్దంటూ ఇప్పటికే.. కేరళ, కర్ణాటక, తెలంగాణలో విద్యార్థులను నిరసన ప్రారంభించారని గుర్తు చేసిన లోకేష్.. ఏపీలో కూడా అలాంటి పరిస్థితి వచ్చే ముందే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనున్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేసి అందరి అభిప్రాయాలతో పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఇక ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దు నిర్ణయంపై లోకేష్ స్పందిస్తూ.. అందరి ఒత్తిడి మేరకు పరీక్షలను రద్దు చేసిన సీఎం నిర్ణయాన్ని లోకేష్ అభినందించారు. పరీక్షలను రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 5శాతం కంటే తక్కువకి వచ్చిందని తెలిపారు. మరి ఏపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read: Bodhan: ఒక్కటొక్కటిగా కదులుతున్నాయి.. నిన్న దర్భంగా.. ఇవాళ బోధన్ టు సౌదీ.. వయా పాకిస్తాన్
AP News: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెలలోనే బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!