Andhra Pradesh: వైఎస్ఆర్ పేరును చెడగొడుతున్నారు.. సీఎం జగన్‌పై కన్నా సంచలన కామెంట్స్..

|

Feb 25, 2023 | 4:25 PM

బీజేపీని వీడి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ఆర్ పేరును చెడగొడుతున్నారని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh: వైఎస్ఆర్ పేరును చెడగొడుతున్నారు.. సీఎం జగన్‌పై కన్నా సంచలన కామెంట్స్..
Kanna Lakshminarayana
Follow us on

బీజేపీని వీడి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ఆర్ పేరును చెడగొడుతున్నారని వ్యాఖ్యానించారు. తండ్రి కంటే మంచి పాలన చేస్తానన్న సీఎం జగన్.. ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన కన్నా.. సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుపై వైసీపీ అసభ్యకరమైన భాష వాడుతోందని దుయ్యబట్టారు. టీడీపీ ఆఫీసులపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయకుండా, బాధితులనే అరెస్ట్ చేయడం రాక్షస పాలనకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు.

సీఎంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం అరాచక పాలనకు పరాకాష్ట అని ఆయన విమర్శించారు. ప్రజల సొమ్మును ప్రజలకే పంచుతూ.. తన ఇంట్ల నుంచి ఇస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారని దుయ్యబట్టారు. పైగా పథకాల పేరుతో వాలంటీర్స్‌ ద్వారా ఓట్ల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు కన్నా. ఇలాంటి పాలన అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు కన్నా.

గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాదం ఏపీలో రాజకీయం దుమారం రేగుతోంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబే చూసుకుందాం రా అనే స్టేజ్ కి వెళ్లింది ఇష్యూ. దీనిపై అటు వైసీపీ నేతల నుంచి కౌంటర్స్ వస్తుండగా.. ఇటు టీడీపీ నుంచి రీకౌంటర్స్ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..