Andhra Pradesh: ముద్రగడకు బుద్ధా వెంకన్న కౌంటర్‌.. బాబును విమర్శిస్తే సహించేది లేదంటూ లేఖాస్త్రం

ఓవైపు జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌కు కౌంటర్‌గా ముద్రగడ పద్మనాభం గళమెత్తుతున్నారు. ఆ వైసీపీ వైపు మొగ్గుతున్నారన్న వార్త అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఇంతకాలం కామ్‌గా ఉండి.. ఇప్పుడు హఠాత్తుగా బీసీ నినాదాన్నందుకున్న ముద్రగడ పద్మనాభంపైకి ప్రశ్నల బాణాలు సంధించారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న

Andhra Pradesh: ముద్రగడకు బుద్ధా వెంకన్న కౌంటర్‌.. బాబును విమర్శిస్తే సహించేది లేదంటూ లేఖాస్త్రం
Buddha Venkanna, Mudragada

Updated on: Jun 20, 2023 | 3:30 PM

ఏపీలో కాపు పాలిటిక్స్‌ కాక రేపుతున్నాయి. ఓవైపు జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌కు కౌంటర్‌గా ముద్రగడ పద్మనాభం గళమెత్తుతున్నారు. ఆ వైసీపీ వైపు మొగ్గుతున్నారన్న వార్త అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఇంతకాలం కామ్‌గా ఉండి.. ఇప్పుడు హఠాత్తుగా బీసీ నినాదాన్నందుకున్న ముద్రగడ పద్మనాభంపైకి ప్రశ్నల బాణాలు సంధించారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. స్వార్థరాజకీయాల కోసం కాపు ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుంటే సహించేది లేదంటూ.. ముద్రగడపై విమర్శల వర్షం గుప్పించారు. ఇంతకాలం జగన్‌ ఏం చేశారో చెప్పాలని లేఖలో ముద్రగడని నిలదీశారు బుద్దావెంకన్న. జగన్‌ ఏమీ చేయకపోయినా ఇంతకాలం ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలన్నారు. జగన్‌ చేసిందేమిటి? బాబు చెయ్యనిదేమిటో చెప్పాలంటూ ముద్రగడని తన బహిరంగ లేఖలో నిలదీశారు.కొందరు దూరమౌతారని తెలిసీ చంద్రబాబు బీసీ రిజర్వేషన్లు ఇచ్చినా బాబంటే మీకు ఎందుకు పడదంటూ లేఖలో ప్రశ్నించారు బుద్దా వెంకన్న.

1994లో కాంగ్రెస్‌ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసకుంటానన్నా.. పిలిచి పార్లమెంటు సభ్యుడిని చేసినా ఆ విషయం ముద్రగడ మర్చిపోయారనీ, కానీ జనం మాత్రం మరువరన్నారు బుద్దావెంకన్న. ఇకపై మీ ప్రతిలేఖకూ బదులిస్తాం..బాబుని విమర్శిస్తే సహించేది లేదని ముద్రగడకి తేల్చి చెప్పారు బుద్దావెంకన్న. కాగా ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబులను విమర్శిస్తూ ముద్రగడ పద్మనాభం అధినేత లేఖాస్త్రం సంధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ లేఖకు కౌంటర్ గానే లేఖను విడుదల చేశారు బుద్ధా వెంకన్న.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..