AP Politics: కడప గడపలో టీడీపీ కొత్త వ్యూహం.. నయా ట్రెండుకు శ్రీకారం చుట్టే ఆలోచన.. బరిలో మహిళానేతను దింపనున్న సైకిల్ పార్టీ
వైసిపి కంచుకోటలో టిడిపి పాగా వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది . ఏది ఏమైనా ఇక్కడ టిడిపి తన ప్రభావాన్ని చూపాలని తహ తహ లాడుతుంది . పార్టి ఆవిర్బావంలో తన సత్తా చూటిన టిడిపి కాలక్రమంలో కనుమరుగై పోయింది. అయితే ఈసారి ఇక్కడ మహిళకు సీటు కేచాయించి అనూహ్య విజయం సాధించాలని ప్లాన్లు వేస్తుంది టిడిపి .. ఈసారి ఇక్కడ మహిళకు సీటు ఇద్దామనే ఆలోచన చేస్తున్నారనే సమాచారం బయటికి పొక్కడంతో నేతలు వారి జీవిత భాగస్వాములకోసం ప్రయత్నాలు మదలుపెట్టేశారు .
ఆవిర్భావం తర్వాత కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మూడుసార్లు గెలిచింది టీడీపీ. 1999 ఎన్నికలే ఇక్కడ టీడీపీకి ఆఖరు గెలుపు. ఆ తర్వాత రెండు సార్లు కాంగ్రెస్.. రెండుసార్లు వైసీపీ… ఇక్కడ విజయం సాధించాయి. అయితే ఈసారి ఎలాగైనా కడపసీటును గెలిచితీరాలన్న కసితో కనిపిస్తోంది సైకిల్ పార్టీ. వర్గపోరు కారణంగా క్యాడర్‌లో చీలికలు రావడంతో పార్టీ కొంత చతికిలబడినా… ఈసారి ముందస్తు ప్రణాళికలతో దూసుకెళ్లాలని భావిస్తోంది. ఇన్నాళ్లూ ప్రధాన పార్టీలన్నీ… కడప అసెంబ్లీ అనగానే.. అయితే రెడ్డి, లేదంటే మైనార్టీ.. అన్నట్టుగా సీట్లు కేటాయించాయి. గత రెండు ఎన్నికల్లో వైసీపీ అయినా, అంతకు ముందు కాంగ్రెస్ అయినా.. మైనార్టీలకు సీటు కేటాయించి విజయం సాధించాయి.ఈ సారి కూడా ఆ పార్టీలు.. అదే సంప్రదాయాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈసారి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీడీపీ.. కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
అభ్యర్థి కోసం అప్పుడే వేట మొదలైందా?
కడపలో పోటీకి.. టీడీపీ హైకమాండ్ ఈసారి వినూత్న ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. కడపగడపలో మహిళకు సీటు కేటాయించి… ప్రధాన పార్టీలకు గట్టీ పోటీ ఇవ్వాలని భావిస్తోంది. వైసిపి వ్యతిరేక ఓటుని చీల్చి.. కడప సీటును తన ఖాతాలో వేసుకోవాలని గట్టి ప్రణాళికతో ముందుకు రాబోతోందట. ఇది, జనరల్ సీటు కావడంతో… ఇప్పటి వరకూ పురుషులకే అవకాశం దక్కింది. దీంతో, ఈసారి కాస్త డిఫరెంటు వేలో వెళ్లాలనుకుంటున్న టిడిపి .. లేడీస్‌ను రంగంలోకి దింపి సత్తా చాటాలనుకుంటోంది. దానికోసం బలమైన అభ్యర్థిని వెతికే పనిలో నిమగ్నమైందట హైకమాండ్. దీనికోసం భారీ కసరత్తులే చేస్తోందిట.
పార్టీలోని ప్రధాన కుటుంబాల నుంచే మహిళా అభ్యర్థి ఎంపిక
పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తున్న రెండు కుటుంబాల నుంచే ఆ మహిళా అభ్యర్థి ఎంపిక ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. టిడిపి పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస రెడ్డి , కడప టిడిపి నేత అలంఖాన్ పల్లె లక్ష్మిరెడ్డి కుటుంబాల నుంచి.. ఎవరో ఒకరిని బరిలో దింపే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మహిళా అభ్యర్థికి అనుకున్నస్థాయిలో ఓట్లు వస్తాయా? రావా? అనే విషయంలో సర్వేలు కూడా చేయించినట్టు సమాచారం.
శ్రీనివాస్‌రెడ్డి భార్య కూడా రేసులో ఉన్నారా?
కడప మున్సిపాలిటీలో ప్రస్తుతం టీడీపీకి ఒకేఒక్క కార్పొరేటర్ ఉన్నారు. ఆవిడే అలంఖాన్ పల్లె లక్ష్మిరెడ్డి కోడలు ఉమాదేవి. అంతా ఓడినా ఆమె మాత్రం టీడీపీ జెండా ఎగరేశారు. కాబట్టి… ఈసారి కడప అసెంబ్లీ బరిలో టీడీపీ తరపున మహిళకు సీటు కేటాయిస్తే.. అది ఆమెకే ఇస్తారన్న ప్రచారం జోరందుకుంది. మరొకరికి అవకాశం ఇవ్వాల్సి వస్తే… అధికారం ఉన్నా, లేకున్నా పార్టీ కోసం నిలబడిన శ్రీనివాస రెడ్డి కుటుంబానికే దక్కుతుంది. ఆ లెక్కన ఆయన భార్య.. రేసులో ఫస్టుంటారన్నది నిర్వివాదాంశం. పురుషులైనా, మహిళలైనా..గెలుపు గుర్రాలకే టిక్కెట్లని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు కాబట్టి… పార్టీ సర్వేల ఆధారంగానే కడపకోటలో ఎవరు పోటీచేస్తారనేది తేలనుంది. చంద్రబాబు కడప పర్యటన తర్వాత… ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం