TDP Vs YCP in Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్ నెలకొంది. ఒక వైపు చంద్రబాబు పర్యటన సందర్భంగా రామకుప్పం మండలం కొల్లుపల్లి లో టీడీపీ, వైసీపీ వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్లదాడి ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. దీంతో వైసీపీ నిరసన ప్రదర్శన చేపట్టింది. కొల్లుపల్లి లో వైసీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి కి నిరసనగా కుప్పంలో వైఎస్సార్ విగ్రహం వరకు వైసీపీ నిరసన ప్రదర్శన చేయనుంది. మొత్తానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాలు బలప్రదర్శనకు సిద్ధమయ్యాయి. భారీ నిరసన ప్రదర్శనకు తరలి రావాలంటూ వైసిపి క్యాడర్ కు పిలుపు నిచ్చారు. ఎమ్మెల్సీ భరత్ ఇంటి నుంచి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైయస్సార్ విగ్రహం వరకు వైసిపి నిరసన ప్రదర్శన చేయనున్నామని ఎమ్మెల్సీ భరత్ ఇప్పటికే ప్రకటించారు.,
మరోవైపు కుప్పంలో చంద్రబాబు పర్యటన ను వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే దీటుగా సమాధానం చెప్పేందుకు టీటీపీ నేతలు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఈ మేరకు టీటీపీ కార్యకర్తలు, అభిమానులు కుప్పంకు చేరుకోవాలని టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. టిడిపి శ్రేణులు గురువారం ఉదయం 8 గంటలకు కుప్పం చేరుకోవాలని చిత్తూరు జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల శ్రేణులు భారీగా కుప్పంకు చేరుకుంటున్నారు.
వైసీపీ, టీడీపీ కార్యకర్తల పోటాపోటీ నిరసనలు, బల ప్రదర్శనలకు రెడీ అవడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ ఆదేశాలతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. అంతేకాదు విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ఎప్పటికప్పుడు కుప్పంలో పరిస్థితిని పోలీసు అధికారులతో సమీక్షిస్తున్నారు ఎస్పీ రిశాంత్ రెడ్డి. అంతేకాదు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇతర జిల్లాల పోలీసు బలగాలు కుప్పానికి చేరుకుంటున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..