క్విట్ జగన్.. సేవ్ ఏపీ, సింగిల్ పాయింట్ అజెండాతో టీడీపీ మహానాడు తొలిరోజు ముగిసింది. ప్రస్తుతం వైసీపీ పాలన వైఫల్యాలతో నిండిందని, టీడీపీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపేలా పునరంకితం కావాలని పిలుపునిచ్చారు నేతలు. ఏపీ కోసం 12 తీర్మానాలను, తెలంగాణ కోసం మూడు తీర్మానాలను ప్రవేశపెట్టారు.
తెలుగుదేశంలో సంస్థాగతంగా మార్పులు జరగబోతున్నాయి. దీనిపై ముందే సంకేతాలు ఇచ్చారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. మూడు సార్లు వరుసగా ఓడిన వారికి ఇకపై టిక్కెట్ ఇవ్వకూడదని నిర్ణయించబోతున్నారు. అలాగే రెండు సార్లు పార్టీ పదవుల్లో ఉన్న వారు మూడోసారి ఆ పదవి నుంచి బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలను మహానాడులో చిట్‌చాట్‌గా మీడియాతో చెప్పారు లోకేష్. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తాను బ్రేక్ తీసుకుంటానన్నారు. ఒకే వ్యక్తి ఏళ్ల తరబడి ఉంటే కొత్త తరం ఎలా వస్తుందని ప్రశ్నించారు. మరోవైపు 30 నియోజకవర్గాల్లో నేతలు సరిగా లేరని, కొన్నిచోట్ల అభ్యర్థులు దండంపెడితే గెలిచేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. పనిచేయని నేతలు, ఇన్‌చార్జ్‌లకు అవకాశం లేదన్నారు.
ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసంపై తీర్మానం ప్రవేశపెట్టారు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వ్యవస్థలపై సీఎం జగన్ కు నమ్మకం లేదన్నారు. పరిపాలనా వ్యవస్థను జగన్ భ్రష్టుపట్టించారు. తన తండ్రి హయాంలో జగన్ చేసిన అవినీతికి ఐఏఎస్ లు జైళ్ల పాలయ్యారు. సీఎం హోదాలో ఉన్న జగన్ మాటను అమలు చేసినందుకు 8 మంది IASలకు కోర్టు జైలు శిక్ష విధించింది. అధికారులను వాడుకుని వదిలేయడం జగన్ కు అలవాటు. గత ఎన్నికల్లో ఎల్వీ సుబ్రమణ్యాన్ని వాడుకుని.. ఆ తర్వాత గెంటేశారు. ఎల్వీ సుబ్రమణ్యాన్ని జగన్ లోపలకు పిలిచి ఏం అన్నారో ఏమో.. బయటకొచ్చి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎల్వీ సుబ్రమణ్యం హైదరాబాద్ లో ఉండే పదవీ విరమణ చేశారు. గౌతమ్ సవాంగ్ ని వాడుకుని పక్కన పెట్టేశారు. న్యాయ వ్యవస్ధపై జగన్ సహా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యం.
రాజ్యసభ సీట్లను YCP అమ్ముకుందని చంద్రబాబు ఆరోపించారు. ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణయ్య ఏమైనా బీసీలకు ఛాంపియనా అని మహానాడు వేదికగా ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎక్కడ సమన్యాయం పాటించారని అన్నారు.
సీఎం జగన్ పరిపాలన చేతకాక, అప్పులు పుట్టక, పథకాలు కొనసాగించలేక మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని వివరించారు. ఆయనకు ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.
చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందన్నారు. పసుపు రంగు చూస్తే చైతన్యం వస్తుందన్నారు. రాజకీయం అంటే తమాషా కాదన్నారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోందన్నారు. చేతకాని దద్దమ్మ జగన్ వల్ల రాష్ట్రం పరువు పోతోందన్నారు.
దావోస్ లో సీఎం జగన్ ఏం చేస్తున్నారో చూశారా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. గ్రీన్ కోతో టీడీపీ హయంలో ఇప్పుడు ఆయన ఒప్పదం కుదుర్చుకున్నారు అంటూ చంద్రబాబు విమర్శించారు.
క్విట్ జగన్.. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. అంటూ ప్రతి ఇంట్లో చర్చించుకోవాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.
జగన్ అండ్ కంపెనీ ఆదాయం పెరిగింది.. ఆయన జగన్ అనుయాయుల ఆదాయం పెరిగింది. ప్రజల ఆదాయం మాత్రం తగ్గిందని చంద్రబాబు విమర్శించారు.
కోనసీమను సర్వనాశనం చేయడానికి కులాల మధ్య చిచ్చు పెడతారా..? అంబేద్కర్ పై అభిమానం ఉంటే .. అమరావతిలో విగ్రహం ఎందుకు పెట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు. కోనసీమలో అల్లర్లకు వైసీపీయే కారణమని.. వారే తమ మనుషుల్ని పెట్టుకుని అమలాపురంలో విధ్వంసం సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వారి ఇళ్లను వారే తగలబెట్టుకుని ఇతరులపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి ఇల్లు తగలబడిపోతుంటే అక్కడున్న పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వాన్ని నిలదీసే సమయం వచ్చిందని గుర్తు చేశారు. ఓ ఎస్సీ యువకుడిని చంపి ప్రమాదం అంటూ క్రియేట్ చేశారు. దళిత సంఘాలు వెంటపడ్డాయి. టీడీపీ సహకరించింది. నిజం బయటపడిందని అన్నారు చంద్రబాబు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్దాలకోరు అని విమర్శించారు. కోడికత్తి ఏమైందని ప్రశ్నించారు. ఈ రోజు నేనే ముందే చెప్పాను.
తన కృషి వల్లే హైదరాబాద్‌లో ISB ఏర్పాటైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దాని ఏర్పాటు కోసం తాను స్వయంగా ISB బోర్డు సభ్యులను కన్విన్స్ చేశానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రధాని గుర్తించకపోయినా, తెలుగువారి కోసం చేసిన పని తనకు సంతృప్తినిస్తుందని మహానేడు వేదికలో చంద్రబాబు అన్నారు.
వైసీపీ అవినీతి పాలన కారణంగానే రాష్ట్రం దివాళా తీస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అప్పుల భారం రూ.8లక్షల కోట్లకు చేరిందని అన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టును మరిచారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఎందుకు మరిచారని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వైసీపీ ప్రభుత్వానికి చేతకాదని మహానాడు వేదికగా విమర్శలు చేశారు చంద్రబాబు.. ఏపీలో ఉన్మాదపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. సంక్షేమం పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. రాని కరెంటుకు కూడా బాదుడే బాదుడు మొదలు పెట్టారని విమర్శించారు.
టీడీపీ నేతల అరెస్టులపై మహానాడు వేదికగా చంద్రబాబు స్పందించారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులతో తాను నిద్రలేని రాత్రులను గడపానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని విరోదులుగా చూస్తున్నారి అన్నారు.
వైసీపీ(YCP) తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. ఎవరు తప్పు చేసినా వదిలేది లేదు. ప్రజా సమస్యలపైనే మన పోరాటం. రాష్ట్రంలో ఏ రైతు ఆనందంగా లేరు.
రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. రోడ్లపైకి రండి. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి. మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరేసే పరిస్థితి తీసుకోస్తారా? రాష్ట్రంలో నిత్యావసరాలు కొనే పరిస్థితి లేదు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను తీసేశారు. విదేశీ విద్య, పెళ్లి కానుక పథకాలన్నీ ఏం చేశారు?‘‘ అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాదుడే బాదుడు కొనసాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తప్పుచేసినవారిని వదిలిపెట్టబోనన్నారు. ప్రజాసమస్యలపైనే టీడీపీ పోరాటం చేస్తుందని మరోసారి గుర్తుచేశారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జగన్ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఒంగోలులో జరగనున్న తెలుగుదేశం మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు బయల్దేరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివెళ్లారు.