TDP: ఈ జిల్లాలో టీడీపీ సీనియర్స్‎ను కాదని యంగ్ లీడర్స్‎ను తెరపైకి.. వీరి గెలుపు ఖాయమా..

ఉమ్మడి విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఈసారి సీనియర్స్‎ను పక్కనబెట్టి అధిక సంఖ్యలో యంగ్ లీడర్స్‎ను ఎన్నికల బరిలోకి దించింది. ఒకరిద్దరు కాదు ఇప్పటివరకు మొత్తం నలుగురు యంగ్ లీడర్స్‎కి ఛాన్స్ ఇచ్చింది. లోకేష్ టీమ్‎గా ఉండేందుకే జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజకవర్గాల్లో ఇప్పటివరకు నాలుగు నియోజకవర్గాల్లో యంగ్ లీడర్స్ పేర్లు ప్రకటించింది పార్టీ. సాహసమో? లేక ఆత్మవిశ్వసమో తెలియదు కానీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.

TDP: ఈ జిల్లాలో టీడీపీ సీనియర్స్‎ను కాదని యంగ్ లీడర్స్‎ను తెరపైకి.. వీరి గెలుపు ఖాయమా..
Tdp Mla Candidates

Edited By:

Updated on: Feb 29, 2024 | 10:33 AM

ఉమ్మడి విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఈసారి సీనియర్స్‎ను పక్కనబెట్టి అధిక సంఖ్యలో యంగ్ లీడర్స్‎ను ఎన్నికల బరిలోకి దించింది. ఒకరిద్దరు కాదు ఇప్పటివరకు మొత్తం నలుగురు యంగ్ లీడర్స్‎కి ఛాన్స్ ఇచ్చింది. లోకేష్ టీమ్‎గా ఉండేందుకే జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజకవర్గాల్లో ఇప్పటివరకు నాలుగు నియోజకవర్గాల్లో యంగ్ లీడర్స్ పేర్లు ప్రకటించింది పార్టీ. సాహసమో? లేక ఆత్మవిశ్వసమో తెలియదు కానీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో కురుపాం, పార్వతీపురం, గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. కురుపాం ఎస్టీ నియోజకవర్గానికి తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గానికి విజయ చందర్ బోనెల, గజపతినగరం నియోజకవర్గానికి కొండపల్లి శ్రీనివాసరావును ఆ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించగా ఈ ముగ్గురు కొత్త అభ్యర్థులే కాగా మరో యంగ్ లీడర్ అదితి గజపతి రాజు మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. గజపతినగరం నియోజకవర్గంలో అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు మనవడు. అలాగే గంట్యాడ మండలం మాజీ జడ్పీటిసి కొండపల్లి కొండబాబు కుమారుడు. విద్యావంతుడు, విదేశాల్లో చదువుకొని ఉద్యోగం చేసి ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించారు.

నిన్నటి వరకు సభ్యత్వం కూడా లేదు. కొన్ని పరిణామాలు దృష్ట్యా అధిష్టానం అనూహ్యంగా ఇక్కడ ఇంచార్జిగా ఉన్న కొండపల్లి అప్పలనాయుడును ప్రక్కనపెట్టి కొండపల్లి శ్రీనివాసరావుకు టిక్కెట్ ఇచ్చింది పార్టీ హైకమాండ్. దీంతో ఇక్కడ ఇంచార్జిగా ఉన్న కే ఏ నాయుడు తన అసమ్మతిని వ్యక్తం చేస్తూ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఇక ఇక్కడ మరో నియోజకవర్గం కురుపాం.. టీడీపీ అభ్యర్థిగా తోయక‌ జగదీశ్వరిని ప్రకటించారు. ఈమె‌ ఉపాధ్యాయురాలు. ఎస్టీ జాతాపు కులానికి చెందిన మహిళ. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. జగదీశ్వరి 2006 నుంచి 2011 తాడికొండ ఎంపిటిసిగా, 2021లో ఎల్విన్ పేట ఎంపిటిసిగా ఎన్నికయ్యారు. తరువాత క్రమంలో ఈమెను కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జిగా నియమించింది పార్టీ. అప్పటినుండి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉన్న జగదీశ్వరి అసెంబ్లీ బరిలో నిలవడం ఇదే తొలిసారి. అయితే ఈమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఇక్కడ సీనియర్లు దత్తి లక్ష్మణరావు వర్గం‌ ఈమెకి ఏమేరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది. ఇక జిల్లాలో మరో కీలక నియోజకవర్గం పార్వతీపురం. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయిన ఇక్కడ విజయ్ చందర్‎ని బరిలో‌ దింపింది తెలుగుదేశం పార్టీ.

విజయచందర్ విశాఖపట్నంలో ఉంటూ తన తండ్రి బోనెల మార్క్ పరిచయాల కారణంగా సీటు దక్కించుకున్నారు. ఎప్పుడో పూర్వికులు ఈ ప్రాంతంలో ఉండేవారు. ఎన్ఆర్ఐ సింబల్‎తో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇక్కడ మొదట నుండి సీనియర్లుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అనేక సందర్భాల్లో విజయచందర్‎ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వారిద్దరూ విజయ్ చంద్రకి ఏమేరకు సహకరిస్తారో చూడాలి. అంతేకాకుండా విజయనగరం నియోజకవర్గ అభ్యర్థిగా అదితి గజపతి రాజును ప్రకటించింది టిడిపి. ఇక్కడ అశోక్ గజపతి రాజుకు టిక్కెట్ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే అశోక్ గజపతి రాజు వారసురాలిగా ఆయన కుమార్తె అదితి గజపతికి టిక్కెట్ లభించింది. ఇలా దాదాపు ప్రకటించిన ఏడు నియోజక వర్గాల్లో నాలుగు నియోజకవర్గాల్లో యంగ్ లీడర్స్ కావడం, వారంతా లోకేష్ టీమ్ గా ఎస్టాబ్లిష్ కావడంతో ఈ సారి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. అయితే ఇక్కడ అసమ్మతితో ఉన్న పార్టీ సీనియర్లను బుజ్జగించి కొత్త అభ్యర్థులను అధిష్టానం ఎలా ఎన్నికలకు సిద్ధం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. అయితే కొత్తగా వచ్చిన యంగ్ అభ్యర్థులకు అక్కడున్న సీనియర్లు సహకరిస్తారా? లేక అసమ్మతి గళం వినిపిస్తారా? అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్‎గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..