Andhra Pradesh: మండపేటలో హై టెన్షన్.. టిడ్కో ఇళ్ల ఇష్యూపై పరస్పర విమర్శలు.. బహిరంగ చర్చకు సవాల్..

|

Feb 26, 2023 | 9:44 AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలతో పొలిటికల్ హీట్ నెలకొంది. మండపేటలో ప్లేస్‌ ఫిక్స్‌ అయింది. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ, టీడీపీ ఎమ్మెల్యే...

Andhra Pradesh: మండపేటలో హై టెన్షన్.. టిడ్కో ఇళ్ల ఇష్యూపై పరస్పర విమర్శలు.. బహిరంగ చర్చకు సవాల్..
Mandapeta Conflict
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలతో పొలిటికల్ హీట్ నెలకొంది. మండపేటలో ప్లేస్‌ ఫిక్స్‌ అయింది. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ, టీడీపీ ఎమ్మెల్యే రెడీ అవుతున్నారు. ఈ ఉదయం 10 గంటలకు బహిరంగ చర్చ. టిడ్కో ఇళ్లలో ఏం జరిగిందనేది సబ్జెక్ట్. పోలీసులు మాత్రం పర్మిషన్‌ లేదు.. బయటకు రావొద్దని హెచ్చరించారు. దీంతో సమయం సమీపిస్తున్నకొద్దీ టెన్షన్‌ పెరుగుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో హైటెన్షన్‌ కొనసాగుతోంది. టిడ్కో ఇళ్లలో అవినీతి, కేటాయింపులో అక్రమాలపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే జోగేశ్వరరావు మధ్య సవాళ్లు వేడి రాజేశాయి. టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని త్రిమూర్తులు ఆరోపించారు. దీనిపై సెంటర్‌లో చర్చకు సిద్ధమంటూ ఆయన సవాల్‌ చేయగా.. టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు దాన్ని స్వీకరించారు.

టిడ్కో గృహ సముదాయం వద్ద మౌలిక సదుపాయాలు, ఇతర సమస్యలపై ఆదివారం బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఒకరికొకరు సవాలు చేసుకోవడంతో పట్టణంలో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే లబ్ధిదారులందరికీ ఆదివారం ఉదయం 9 గంటలకు ర్యాలీగా సభా వేదిక వద్దకు వెళ్దామని మైకు ప్రచారం ద్వారా పార్టీ శ్రేణులకు సూచించారు. మరోపక్క ఎమ్మెల్సీ కూడా తాము అన్ని విధాలా సిద్ధమంటూ శనివారం మున్సిపల్‌ కమిషనర్‌ టి.రామ్‌కుమార్‌తో చర్చించారు.

టిడ్కో ఇళ్లలో అక్రమాలపై తోట త్రిమూర్తులు, జోగేశ్వర్‌రావు సవాళ్లతో పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. టిడ్కో గృహాలు చుట్టూ 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. బహిరంగ చర్చకు అనుమతుల్లేవని రామచంద్రాపురం డీఎస్పీ బాలచందర్ రెడ్డి చెప్పారు. రాజకీయ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ రావొద్దని.. టిడ్కో గృహాల దగ్గరకు వస్తే చర్యలు తప్పని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..