Andhra Pradesh: వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ.. ఏంటో తెలిస్తే అభినందించాల్సిందే

విజయవాడలో గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో వరదలు పోతెత్తాయి. అనేక గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు. బాధితులకు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు సైతం అండగా నిలిచారు. తాజాగా వరద బాధితులను ఆదుకునేందుకు తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది.

Andhra Pradesh: వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ.. ఏంటో తెలిస్తే అభినందించాల్సిందే
Golden Temple Donation

Edited By:

Updated on: Nov 05, 2024 | 7:12 AM

విజయవాడ వరద బాధితుల పట్ల దేశమంతా అండగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ ఏకమై దాదాపు 500 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పలు ఎన్జీవోలు, ప్రజాసంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలే కాకుండా చాలామంది వ్యక్తిగతంగాను ముందుకు వచ్చి వరద బాధితులకు మేము ఉన్నాం అంటూ ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.

గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ వితరణ

విజయవాడ వరద బాధితులకు వస్త్ర వితరణ చేసేందుకు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. తమిళనాడులోని వేలూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ప్రతినిధి కళ్యాణ్ చక్రవర్తి వరద బాధితుల కోసం 5 వేల వస్త్ర కిట్లను విజయవాడ తీసుకొచ్చారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిసి కిట్ ను చూపించారు.

ఇవి కూడా చదవండి

ఒక్కో కిట్ లో ఏమున్నాయో తెలుసా?

ఒక్కో కిట్ లో దుప్పటి, కండువా, చీర, పంచె ఉంటాయని సీఎంకు తెలిపారు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ప్రతినిధులు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ ను అభినందించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ వస్త్రాలను అధికారుల ద్వారా ప్రభుత్వం నిరుపేద వరద బాధితులకు పంపిణీ చేయనున్నట్టు సీ ఎం ఓ వివరించింది.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..