Andhra: అలెక్స్ మాములోడు కాదు.. తమిళనాడులో తప్పించుకుంటే.. చిత్తూరులో ఇలా బుక్కయ్యాడు..

తమిళనాడు పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న గ్యాంగ్ స్టర్ అలెక్స్ ఎట్టకేలకు చిత్తూరు జిల్లా పోలీసులకు దొరికాడు.. చిత్తూరు జిల్లా గుడిపాల పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను అదుపులోకి తీసుకున్నారు. గుడిపాల మండల పరిధిలో అత్యాచారం కేసులో పోలీసులు అరెస్టు చేసారు.

Andhra: అలెక్స్ మాములోడు కాదు.. తమిళనాడులో తప్పించుకుంటే.. చిత్తూరులో ఇలా బుక్కయ్యాడు..
Crime News

Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 05, 2025 | 1:13 PM

తమిళనాడు పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న గ్యాంగ్ స్టర్ అలెక్స్ ఎట్టకేలకు చిత్తూరు జిల్లా పోలీసులకు దొరికాడు.. చిత్తూరు జిల్లా గుడిపాల పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను అదుపులోకి తీసుకున్నారు. గుడిపాల మండల పరిధిలో అత్యాచారం కేసులో పోలీసులు అరెస్టు చేసారు. వివరాల ప్రకారం.. తిరువన్నామలైకి చెందిన అలెక్స్ వేలూరులో నివాసం ఉంటున్నాడు.. ఇతనిపై 20కి పైగా తమిళనాడులో కేసులు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ అత్యాచారం, హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా అలెక్స్ ఉన్నాడు.. అలాగే.. దోపిడీలు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిన కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు. ఇలా దాదాపు 50కి పైగా కేసులు అలెక్స్ పై ఉన్నాయి.. దీంతో తమిళనాడు పోలీసులు ఏడాదిగా అలెక్స్ కోసం గాలిస్తున్నారు.

ఇప్పటికే రెండుసార్లు పిడి యాక్ట్ కింద అరెస్ట్ అయిన అలెక్స్.. గ్యాంగ్‌స్టర్‌గా నేరాలకు పాల్పడుతూనే ఉన్నాడు. ఇందులో భాగంగానే చిత్తపార మండల పరిధిలో మహిళపై లైంగిక దాడి చేశాడు.. అనతరం పారిపోతూ దొరికిపోయాడు. తమిళనాడుకు సరిహద్దులో ఉన్న చిత్తూరును సేఫ్ జోన్ గా ఎంచుకునే ప్రయత్నంలో అలెక్స్ గుడిపాల మండలంలోని చిత్తపార కు వచ్చాడు. గత రెండు నెలలుగా చిత్తూరు రూరల్ ఏరియాలో తల దాచుకునే ప్రయత్నం చేస్తున్న అలెక్స్.. చిత్తపార లో ఒక మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు. మహిళపై లైంగిక దాడికి పాల్పడి పారిపోతున్న అలెక్స్‌ను పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మహిళ ఫిర్యాదుతో అలెక్స్‌ను అదుపులోకి తీసుకున్న గుడిపాల పోలీసులు.. ఈ మేరకు కేసు నమోదు చేశారు. అలెక్స్ కోసం చిత్తూరు జిల్లా పోలీస్ అధికారులను తమిళనాడు సిఐడి ఇంటెలిజెన్స్ పోలీసులు సంప్రదించినట్లు సమాచారం.. ఎన్నో నేరాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అలెక్స్ ఎట్టకేలకు పట్టుబడినట్లు ఏపీ పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..