Tadipatri Politics: కరపత్రాలు పంపిణీతో హీటెక్కిన తాడిపత్రి పాలిటిక్స్.. విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయంటూ..

ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు వేడేక్కుతున్నాయి. పెద్దారెడ్డి ఆస్తులు ‘అప్పుడు-ఇప్పుడు’ అంటూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మే 29న జేసీ వర్గం 4 పేజీల కరపత్రాలు పంచిన సంగతి తెలిసిందే. అదే తరహాలో..

Tadipatri Politics: కరపత్రాలు పంపిణీతో హీటెక్కిన తాడిపత్రి పాలిటిక్స్.. విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయంటూ..
Tadipatri Politics

Updated on: Jun 11, 2023 | 11:17 AM

Tadipatri Politics: ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు వేడేక్కుతున్నాయి. పెద్దారెడ్డి ఆస్తులు ‘అప్పుడు-ఇప్పుడు’ అంటూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మే 29న జేసీ వర్గం 4 పేజీల కరపత్రాలు పంచిన సంగతి తెలిసిందే. అదే తరహాలో తాజాగా మరోసారి ఎమ్మెల్యే పెద్దారెడ్డికి వ్యతిరేకంగా కరపత్రాలను పంపిణీ చేసింది జేసివర్గం.

‘పెద్దారెడ్డి పాదయాత్ర చేస్తుంటే.. అనుచరులు క్రికెట్ బెట్టింగ్ జాతర చేస్తున్నారు. నాటుసారా అమ్మే నీచమైన చరిత్ర పెద్దారెడ్డిది. పెద్దారెడ్డి హయాంలో తాడిపత్రిలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు. పెద్దారెడ్డి అనుచరులు, బంధువులు తాడిపత్రిలో మట్కా నిర్వహిస్తున్నారు’ అంటూ తాడిపత్రి పురవీధులు, షాపుల ముందు కరపత్రాలను జేసీ వర్గం పంచి పెట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..