Andhra Pradesh: వామ్మో ఇదేం ట్విస్ట్.. ఏపీలో ఎగ్జిట్ పోల్స్ తర్వాత మరింత పెరిగిన ఉత్కంఠ

|

Jun 02, 2024 | 5:56 PM

ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలతో ఫలితాలపై క్లారిటీ వస్తుందనుకున్నారు. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది. రిజల్ట్స్‌పై క్లారిటీ ఇవ్వాల్సిన ఎగ్జిట్ పోల్స్.. నేతలను మరింత టెన్షన్‌లో పడేశాయి.

Andhra Pradesh: వామ్మో ఇదేం ట్విస్ట్.. ఏపీలో ఎగ్జిట్ పోల్స్ తర్వాత మరింత పెరిగిన ఉత్కంఠ
Jagan Vs Chandrababu
Follow us on

ఏపీలో ఎన్నికల ఫలితాలపై గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. నువ్వా నేనా అన్నట్టుగా నేతలు పోటీ పడటమే ఇందుకు ప్రధాన కారణం. పోలింగ్ ముగిసిన వెంటనే విజేతలు ఎవరనే దానిపై మొదలైన సస్పెన్స్‌.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్‌తో దీనిపై ఓ స్పష్టత వస్తుందని భావించినా.. అందులోనూ సేమ్ సీన్ కనిపించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పలు ఎగ్జిట్ పోల్స్ వైసీపీదే విజయం అంటుంటే.. మరికొన్ని మాత్రం ఏపీలో కింగ్ కూటమే అని అంచనా వేశాయి. దీంతో గత 20 రోజులుగా ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ మరింత పెరిగింది.

వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్‌తో వాస్తవ ఫలితాలు అంచనా వేయొచ్చని విశ్లేషకులతో పాటు ప్రధాన పార్టీల నాయకులు భావించారు. అయితే క్లారిటీ ఇవ్వాల్సిన ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు నేతలను మరింత టెన్షన్ పెడుతున్నాయి. భిన్నమైన అంచనాలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌ రాజకీయ పార్టీ శ్రేణులను కన్ఫ్యూజన్‌లో పడేశాయి. తమకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్‌ నిజమవుతాయని.. ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అంటూ నేతలు విమర్శలు గుప్పించారు.

ఎగ్జిట్‌పోల్స్‌ గందరగోళంగా ఉన్నాయి.. లోకల్‌ సర్వేలు తమకు పాజిటివ్‌గా ఉన్నాయంటోంది వైసీపీ. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తమకే అనుకూలంగా ఉన్నాయి.. అధికారం తమదే అని కూటమి పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తమకు అనుకూలంగా ఉన్నాయని ఎవరికి వారు ప్రకటించుకుంటున్నారు. అందుకు కారణాలు కూడా విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్‌తో ఓ అంచనా వస్తుందని భావించిన నేతలు, పార్టీలకు మరింత టెన్షన్ పెరిగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..