ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. వేసవి సెలవుల అనంతరం పిటిషన్ పై విచారణ జరిపే అవకాశం ఉంది. ఈ విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ పలు పిటీషన్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస కేంద్ర సహా మరి కొందరు ఈ పిటీషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగ లేదని.. ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయనేది పిటీసన్లు కోర్టు ముందు వాదనలు వినిపించారు. ఇదే అంశంపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణ జరుపింది.
ఇవాళ వాడి వాడి వేడి వాదనలు జరిగాయి. అయితే మరోసారి విచారణను వాయిదా వేసింది కోర్టు. తిరిగి వేసవి సెలవుల తర్వాత మరోసారి వాదనలు ఉంటాయని తెలిపింది. గత వారం రోజుల క్రితం దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. అఫిడవిట్‌ను దాఖలు చేసింది. విభజన సహేతుకంగా చోటు చేసుకోకపోవడం, సుదీర్ఘకాలంగా పునర్విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించలేకపోవడం.. వంటి చర్యల వల్ల తాము నష్టపోతోన్నామని పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్, నిధుల-విధుల విభజన, ప్రత్యేక హోదా అంశాలను కూడా పిటీషన్‌లో పొందుపరిచారు పిటీషనర్లు.
ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ మహ్మఫూజ్ ఏ నాజ్కీ వాదించారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఆస్తుల పంపకాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. తమ వాటాగా దక్కాల్సిన మెజారిటీ ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉండిపోవడం, సకాలంలో పంపకాలు పూర్తికాకపోవడం వల్ల తాము నష్టపోవాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పిటీషన్‌లో అభ్యర్థించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం