మత్స్య సంపద వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా విజయవాడలో మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నెల 28 నుంచి 30 తేదీ వరకు విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ‘ఫిష్ ఆంధ్ర’ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకే ఈ సీ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశీయంగా ఫిష్ వినియోగం పెంచేందుకుగాను ఏపీ ప్రభుత్వం సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కమిషన్ కన్నబాబు తెలిపారు.
ఈ మూడు రోజుల ఫెస్టివల్‌లో భాగంగా చేపలతో పాటు ఇతర సీ ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. విజిటర్స్ కోసం రూ. 699కే అన్‌లిమిటెడ్ సీ ఫుడ్‌ను అందించనున్నారు. ఏడేళ్ల లోపు చిన్నారులకు ఉచితంగా అందించనున్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో భాగంగా మహిళల కోసం పలు రకాల వంటల కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మత్స్య శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు.
ఇక సీ ఫుడ్ ఫెస్టివల్‌లో భాగంగా పోషకాహార నిపుణులతో సెమినార్లు, 2కే రన్ కూడా నిర్వహిస్తున్నట్లు కన్నబాబు తెలిపారు. కేవలం విజయవాడలోనే కాకుండా ఈ ఫుడ్ ఫెస్టివల్స్‌ను విశాఖపట్నం, కాకినాడ, భీమవరం, నెల్లూరుల్లోనూ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో అన్ని జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోనూ ఫెస్టివల్స్ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..