ఏపీలో పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఒకే విడతలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తు్న్న తరుణంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా అన్ని రకాలా ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.14 కోట్లు ఉందని.. వీరి కోసం మొత్తం 46 వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన కేసుల్లో మొత్తం 864 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని తెలిపారు. జనవరి నుంచి ఈ రోజు వరకు 382 కోట్ల రూపాయలు సీజ్ చేశామని వివరించారు. రాష్ట్రంలో 14 నియోజకవర్గాల్లో పోలింగ్‌ను పూర్తిగా వెబ్ కాస్టింగ్ చేయడంతో పాటు అక్కడ భద్రతా కోసం ఎక్కువగా కేంద్ర బలగాలను వినియోగించబోతున్నామని తెలిపారు.
ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. అందులో పురుష ఓటర్లు 2,03,39,851 కాగా మహిళా ఓటర్లు 2,10,58,615 ఉన్నట్లు తెలిపారు. ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో ఇప్పటి వరకు మొత్తం 864 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ప్రకటించారు. అలాగే ఈరోజు వరకు రూ. 382 కోట్లు సీజ్ చేశామన్నారు. 14 నియోజకవర్గాల్లో పూర్తిగా వెబ్ కాస్టింగ్ నిఘాలో పోలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు ముకేష్ కుమార్ మీనా. ఈ నియోజకవర్గాల్లో భద్రత కోసం ప్రత్యేక కేంద్ర బలగాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు తమ పరిధిలోకి వచ్చిన ఎలాంటి కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన అంశాన్నైనా సి – విజిల్ యాప్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. ఈ ప్రత్యేక యాప్ లో కంప్లైంట్ ఇచ్చిన గంటల వ్యవధిలో చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…