AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి, పగలు ఒకటే దడ.. మంత్రగాళ్లు వచ్చినా మారని తీరు.. ఆత్మ భయంతో ఆఫ్యామిలీ ఏం చేసిందంటే?

కొద్ది నెలల కిందట చనిపోయిన ఇంటి పెద్ద ఆత్మ.. ఆ కుటుంబాన్ని వెంటాడిందా? కంటిమీద కునుకు లేకుండా చేసిన భయమే వారి పాలిట శాపమైందా? శ్రీకాకుళం జిల్లాలో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అర్ధరాత్రి వేళల్లో వెంటాడుతున్న భయం, దానికి తోడు చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు తట్టుకోలేకపోయిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.

రాత్రి, పగలు ఒకటే దడ.. మంత్రగాళ్లు వచ్చినా మారని తీరు.. ఆత్మ భయంతో ఆఫ్యామిలీ ఏం చేసిందంటే?
Srikakulam Family Suicide
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Jul 12, 2026 | 7:00 AM

Share

రాకెట్‌ యుగంలోనూ మూడనమ్మకాల కారణంగా జనాలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే శ్రీకాకులం జిల్లాలో వెలుగు చూసింది. చనిపోయిన వ్యక్తి ఆత్మమాగా మారి.. తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని.. నమ్మిన ఓ కుటుంబ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం మర్రివలస గ్రామానికి చెందిన ముద్ద అప్పయ్య, దాలప్పమ్మ(65) భార్యాభర్తలు. వీరికి నలుగురు కుమార్తెలు. చిన్న కుమార్తె సరస్వతి దివ్యాంగురాలు. ఈమెకు వివాహం జరగలేదు. పెద్ద కుమార్తెకు కొంగరాపు దాలమ్మకు వివాహమై భర్తతో విడిపోయి పుట్టింటికి వచ్చేసింది. మిగిలిన ఇద్దరు కుమార్తెలకు వివాహలై వారి వారి అత్తింటి వద్ద కాపురాలు చేసుకుంటున్నారు.

అయితే ఐదు నెలల క్రిందట ఇంటి పెద్ద అప్పయ్య మృతి చెందారు.అప్పటి నుండి అతని భార్య, భార్యతో పాటు అదే ఇంట్లో నివాసం ఉంటున్న ఇద్దరు కుమార్తెలు తీవ్ర మానసిక వేదనతో నలిగిపోతున్నారు. ముఖ్యంగా ఇంటి పెద్ద మరణం వారినీ కోలుకోలేని దెబ్బతీసింది. భర్త మరణ వేదనను దిగమింగుకుంటూ దివ్యాంగురాలు అయిన చిన్న కుమార్తెను, ఒంటరి మహిళ అయిన పెద్ద కుమార్తె పోషణను చూసుకుంటూ కుటుంబాన్నీ నడిపించటం దాలప్పమ్మకి శక్తికీ మించిన భారం అయింది. పెద్ద దిక్కు లేకపోవటం, అనారోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలు వెంటాడటంతో భవిష్యత్ పట్ల తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో వాళ్ళకి వారే మరణ శాసనం రాసుకున్నారు.

అయితే వీరి మరణం పట్ల వేరే వాదన వినిపిస్తుంది. అప్పయ్య ఆత్మ ఈ ముగ్గురిని వెంటాడుతోందని.. రాత్రి నిద్రించే సమయంలో కళలో కనిపంచటం జరిగేదని.. దీంతో వారు తీవ్ర భయాందోళనలు చెందుతూ వస్తున్నారు దాలప్పమ్మ, కుమార్తెలు దాలమ్మ, సరస్వతిలు. కంటి నిండ నిద్ర లేక, కడుపునిండా తిండి లేక ఇబ్బందులు పడుతూ అనారోగ్యం బారిన పడ్డారని స్థానికులు చెబుతున్నారు. అప్పటికి డబ్బులు ఖర్చు పెట్టి మంత్రగాళ్లను, దాసురాలును పిలిచి పూజలు నిర్వహించటం, వేరే ఇంటికి మారిపోవటం వంటివి చేశారు. అయినా.. వారిని సమస్యలు వేధిస్తుండటంతో ఇక తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని బంధువులు చెబుతున్నారు.

దాలప్పమ్మ, కుమార్తెలు దాలమ్మ, సరస్వతి శుక్రవారం తెల్లవారు జామున గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా.. శుక్రవారం ఉదయం ఇంటి నుండి ఎవరు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు వెళ్ళి చూడగా ముగ్గురు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దాంతో గ్రామంలోని RMP వైద్యుడు వారిని పరియాలించగా దాలప్పమ్మ అప్పటికే మృతి చెందింది. అయితే కుమార్తెలు ప్రాణాలతో ఉండటంతో వారిని జలుమూరు చికిత్స నిమిత్తం జలుమూరు CHC కి తరలించారు. అప్పటికే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కుమార్తెలు దాలమ్మ, సరస్వతి మృతి చెందారు. ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తు పట్ల ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుల బంధువులు చెబుతున్నారు.

తల్లి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య జిల్లాలో చర్చనీయాంశం అవుతుంది. వీరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us