AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త మోటో ప్యాడ్70 గ్రూవ్​లో అద్భుత స్పీకర్లు.. వాటి గురించి తెలిస్తే ఫిదా కావాల్సిందే..

మొబైల్ మార్కెట్లో వరుస సంచలనాలు సృష్టిస్తున్న మోటరోలా సంస్థ భారతీయ వినియోగదారుల కోసం మరో సరికొత్త టాబ్లెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినోదం, ఆఫీస్ పనులు, చదువుల వంటి అన్ని అవసరాలకు సరిపోయేలా అధునాతన ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ ప్రీమియం మిడ్‌రేంజ్ డివైజ్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆకట్టుకునే ఈ గ్యాడ్జెట్ విశేషాలను తెలుసుకుందాం.

కొత్త మోటో ప్యాడ్70 గ్రూవ్​లో అద్భుత స్పీకర్లు.. వాటి గురించి తెలిస్తే ఫిదా కావాల్సిందే..
Moto Pad 70 Groove Tablet
Nikhil
|

Updated on: Aug 05, 2026 | 6:50 AM

Share

ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియులను అలరించేందుకు అద్భుతమైన ఫీచర్లు, శక్తివంతమైన ఆడియో అనుభవంతో కూడిన నయా టాబ్లెట్ మార్కెట్లో అడుగుపెట్టింది. ప్యాంటోన్ బ్లూ సర్ఫ్ రంగులో స్టైలిష్‌గా లభిస్తున్న మోటరోలా బ్రాండ్ తాజా డివైజ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం.

మొబైల్ మార్కెట్లో వరుస సంచలనాలు సృష్టిస్తున్న మోటరోలా సంస్థ భారతీయ వినియోగదారుల కోసం మరో సరికొత్త టాబ్లెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే మోటో ప్యాడ్ 70 గ్రూవ్. ఎంటర్‌టైన్‌మెంట్, ఆఫీస్ వర్క్, స్టడీస్ ఇలా అన్ని అవసరాలకు సరిపోయేలా అధునాతన ఫీచర్లతో దీనిని రూపొందించారు. ప్రీమియం మిడ్‌రేంజ్ విభాగంలో రూ. 33,999కు ఇది లభిస్తోంది. ఒకే ఒక్క వేరియంట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌లో, స్టైలిష్ ప్యాంటోన్ బ్లూ సర్ఫ్ రంగులో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్, మోటరోలా అధికారిక వెబ్‌సైట్లలో దీనిని సొంతం చేసుకోవచ్చు.

అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌

సినిమాలు చూడాలన్నా, ఆన్‌లైన్ క్లాసులు వినాలన్నా డిస్‌ప్లే చాలా ముఖ్యం. దీనిలో ఇచ్చిన 12.1 అంగుళాల పెద్ద స్క్రీన్ అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, హెచ్‌డీఆర్ టెన్ సపోర్ట్ ఉండటంతో కలర్స్ చాలా రిచ్‌గా కనిపిస్తాయి. స్క్రీన్ వెలుగు తగలకుండా కళ్లను కాపాడే సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. ఇక ఆడియో విషయానికొస్తే ఏకంగా తొమ్మిది జేబీఎల్ స్పీకర్లతో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అందించారు.

సినిమా థియేటర్ సౌండ్ క్వాలిటీని ఇంట్లోనే పొందవచ్చు. ఈ టాబ్లెట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ను వాడారు. దీంతో మల్టీటాస్కింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా సాగుతాయి. ల్యాగ్ అనేదే ఉండదు. అవసరమైతే మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు.

భారీ బ్యాటరీ

రోజంతా టాబ్ వాడినా ఛార్జింగ్ అయిపోకుండా 10,200mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో ప్రయాణాల్లో ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది తాజా ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇంటర్‌ఫేస్ చాలా సింపుల్‌గా, వాడుకకు అనువుగా ఉంటుంది. ఆన్‌లైన్ మీటింగ్‌లు, క్లాసుల కోసం 8MP ఫ్రంట్ కెమెరా, పత్రాలను స్కాన్ చేయడానికి, ఫోటోల కోసం 13MP రేర్ కెమెరా ఇచ్చారు. ధూళి, నీటి చుక్కల నుండి రక్షణ కోసం IP52 రేటింగ్ ఉంది. సన్నని డిజైన్‌తో చూసేందుకు చాలా ట్రెండీగా అనిపిస్తుంది. మంచి ఫీచర్లు ఉన్న టాబ్లెట్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

మార్కెట్లో లభిస్తున్న ఇతర టాబ్లెట్లతో పోలిస్తే మోటరోలా అందించిన ఈ కొత్త మోడల్ ధర తగిన విధంగా ఉంది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న ఈ డివైజ్ స్టూడెంట్లకు, ప్రొఫెషనల్స్‌కు ఒకేలా ఉపయోగపడుతుంది. అన్ని రకాల ఆధునిక సదుపాయాలతో వస్తున్న ఈ టాబ్లెట్ టెక్ మార్కెట్లో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది.

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!