Srikakulam: రోడ్డుపై వెళుతున్న ఆటోపై పడ్డ భారీ తాటి చెట్టు…తర్వాత
శ్రీకాకుళం జిల్లాలో గాలి, వాన బీభత్సం సృష్టించగా రణస్థలం వద్ద పెద్ద ప్రమాదం తప్పింది. రామతీర్థం కూడలి వైపు వెళ్తున్న ఆటోపై భారీ తాటి చెట్టు అకస్మాత్తుగా పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఆటో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, విద్యుత్ వైర్లు దెబ్బతినడంతో వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ప్రమాదాలు ఎవరికి ఎప్పుడూ ఎలా వస్తాయో తెలియదు. కొందరయితే పెద్ద ప్రమాదాల నుంచి అదృష్టవశాత్తు రెప్పపాటులో తప్పించుంటారు. శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. జిల్లాలోని రణస్థలం, జి. సిగడాం మండలాల్లో సోమవారం సాయంత్రం గాలి,వాన భీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి గాలి కూడ తోడవ్వడంతో రణస్థలం హైస్కూల్ సమీపంలో రామతిర్థం కూడలి వైపుకు వెళ్తున్న ఆటోపై ఒక్కసారిగా ఓ భారీ తాటి చెట్టు పడింది. అయితే ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఆటోపై బారి తాటి చెట్టు అకస్మాత్తుగా పడటంతో ఆటో పాక్షికంగా దెబ్బతింది. ఆటోలో ఉన్న ఆటో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. సమీపంలోని విద్యుత్ వైర్లు దెబ్బతిన్నాయి. వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడ విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

