Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: శ్రీరాముడికి కుడివైపున సీతమ్మ… గరుడపక్షి వస్తేనే కళ్యాణం… ఏపీలోనే ఉంది ఈ ఆలయం

శ్రీరాముడికి కుడిపక్కన కొలువుతీరిన సీతమ్మ ఉన్న ఆలయం ఇదొక్కటే... ఇదొక్కటేకాదు ప్రకాశంజిల్లా చదలవాడలోని శ్రీరఘునాయకస్వామి ఆలయంలో అన్నీ విశేషాలే... ఇక్కడ శ్రీరామనవమికి కల్యాణం జరిగేటప్పుడు గరుడ పక్షి ఆకాశంలో ప్రదక్షిణలు చేస్తుంది... ఈ ఆనవాయితీ నేటికీ కొనసాగుతుంది... ఇంకో విశేషం ఏంటంటే శ్రీరామ నవమికి ఇక్కడ కళ్యాణం జరగదు... భద్రాచలంలో శ్రీరామ నవమి జరిగిన తొమ్మిదో రోజు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది... 1450 ఏళ్ల క్రితం అగస్త్య మహర్షి చదలవాడకు వచ్చి శ్రీ రఘునాయక స్వామి ఆలయాన్ని ప్రతిష్టించడం మరో విశేషం... శ్రీరామ నవమి సందర్భంగా చదలవాడ శ్రీరఘునాయకస్వామి ఆలయ విశేషాలను తెలుసుకుందాం...

Andhra: శ్రీరాముడికి కుడివైపున సీతమ్మ... గరుడపక్షి వస్తేనే కళ్యాణం... ఏపీలోనే ఉంది ఈ ఆలయం
Sri Raghunayaka swamy temple
Follow us
Fairoz Baig

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 04, 2025 | 3:14 PM

ప్రకాశంజిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన చదలవాడ రఘునాయక స్వామి వారి కళ్యాణ మహొత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి… అయితే విశేషం ఏంటంటే ఈనెల 6వ తేదిన శ్రీరామ నవమి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటుంటే ఒక్క చదలవాడలో మాత్రం భద్రాచలంలో శ్రీరామునికి కళ్యాణం జరిగిన ఎనిమిది రోజుల తరువాత తొమ్మిదో రోజు ఇక్కడ కళ్యాణం చేస్తారు… ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో అగస్త్య మహాముని ప్రతిష్టించిన ఈ దేవాలయానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. సీతాదేవిని రావణాసురుడు అపహరించిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని చెబుతారు. ఇక్కడ తనకు సహాయ సహకారాలు అందించిన వానర సైన్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి నాలుగు దిక్కులకు పంపారని అందువల్లే ఈ గ్రామానికి చాతుర్వాటిక అనే పేరు కూడా వచ్చిందని స్థలపురాణం… ప్రతి ఏటా చైత్ర శుద్ధ దశమి నుంచి 16 రోజుల పాటు ఈ దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

శ్రీరామునికి కుడిపక్క సీతమ్మ… ఈ ఆలయంలో విశేషం…

హిందువుల సాంప్రదాయం ప్రకారం భర్తకి భార్య ఎప్పుడూ ఎడమవైపు మాత్రమే ఉండాలి… ముఖ్యంగా కళ్యాణం, ధాన ధర్మాలు, పూజలు, నోములు చేసేటప్పుడు భర్తకి భార్య తప్పనిసరిగా ఎడమవైపునే ఉండాలని చెబుతారు… అప్పుడే ఫలితం దక్కుతుందని అంటారు… శ్రీ మహా విష్ణువు కూడా తన భార్య అయి శ్రీ మహాలక్ష్మీని ఎడమ స్థానంలో ఉంచుతారట… ఇక అర్ధనారీశ్వరుడు అయిన శివుడు కూడా శరీరంలో ఏడమభాగాన్ని పార్వతికి ఇచ్చేశాడని చెబుతారు… ఏ ఆలయంలో చూసినా స్వామివార్లకు అమ్మవార్లు ఎడమవైపునే ఉంటారు… అందుకే నిజజీవితంలో కూడా భర్తకు భార్య ఎప్పుడూ ఎడమవైపే ఉండాలని చెబుతారు… అలాగే భద్రాచలం ఆలయంలో శ్రీరాముడి విషయంలో కూడా స్థల పురాణం ప్రకారం శంఖచక్రాలు స్దానభ్రంశం అయి ఉన్నా, సీతమ్మ మాత్రం రామయ్య ఎడమ ప్రక్కనే ఆసీనురాలయి కనిపిస్తారు… అయితే చదలవాడ శ్రీరఘునాయక స్వామి ఆలయంలో మాత్రం శ్రీరామునికి కుడివైపున సీతమ్మవారు కొలువుతీరి ఉంటారు… ఇదే ఇక్కడ దేవాలయంలోని విశేషమని చెబుతారు… సాధారణంగా వైష్ణవ ఆలయాలు వైఖానస ఆగమం లేదా పాంచరాత్ర ఆగమాన్ని పాటిస్తాయి…. పాంచరాత్ర ఆగమం ప్రకారం భార్య భర్తకు కుడి పక్కన ఉండాలి… పాంచరాత్ర ఆగమం పాటించే ఆలయాల్లో అమ్మవారు స్వామివారికి కుడి పక్కనే వుంటారని ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు చదలవాడ వెంకట కృష్ణయ్య తెలిపారు.

గరుడపక్షి వస్తేనే కళ్యాణం…

చదలవాడ శ్రీరామ కళ్యాణ వేడకల్లో మరో విశేషం ఉంది… స్వామివారి కళ్యాణం రోజున తలంబ్రాలు పోసే సమయంలో ఒక గరుడపక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదిక్షణలు చేసి వెళుతుంది… ఆరోజు ఉదయం 10 గంటలకు కళ్యాణ క్రతువును ప్రారంభిస్తారు… ఎప్పటిలాగానే ప్రతి ఏడాది స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో గరుడపక్షి వచ్చి ఆలయంపై మూడు ప్రదక్షిణలు చేసి వెళుతుంది… ఈ ఏడాది కూడా అలాగే గరుడ పక్షి వస్తుందని భక్తులు విశ్వాసంతో శ్రీరాముని కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు… భక్తులు గరుడపక్షిని చూసి భక్తితో మైమరచిపోతారు… జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేస్తారు… కన్నులపండువగా నిర్వహించే ఈ కళ్యాణవేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆలయ అర్చకుడు ధీరేంద్రస్వామి చెబుతున్నారు.

చదలవాడ శ్రీరఘునాయకస్వామి ఆలయంలో గరుత్మంతుడి ప్రదక్షిణల సాక్షిగా శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి… అంటూ ఇక్కడ భక్తులు భక్తి తన్మయత్వంతో గీతాలు ఆలపిస్తారు… 1450 ఏళ్ళ క్రితం అగస్త్య మహాముని ప్రతిష్టించిన శ్రీరఘునాయక ఆలయం ఉన్న చదలవాడకు చాతుర్వాటిక అనే పేరు కూడా ఉంది… చాతుర్వాటిక అనే పేరు ఎలా వచ్చిందంటే… రావణాసురుడు అపహరించిన సీతాదేవిని వెతుకుతూ చదలవాడ ప్రాంతానికి వచ్చిన శ్రీరాముడు వానర సైన్యాన్ని ఇక్కడికి పిలిపించారట… ఇక్కడ నుండి వానర సైన్యాన్ని 4 విభాగాలుగా విభజించి, 4 దిక్కులకు సీతాదేవి ని వెతికేందుకు పంపించారని స్థల పురాణాన్ని బట్టి అర్ధం అవుతోంది… వానరసైన్యాన్ని ఈ ప్రాంతం నుంచే నలుదిక్కులకు పంపించడం వల్ల చదలవాడ గ్రామానికి చాతుర్వాటిక అనే పేరు వచ్చిందని చెబుతారు… కాలక్రమేణా ఈ చాతుర్వాటికే చదలవాడగా పేరుగాంచిందని స్థానికులు చెబుతుంటారు… ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే గరుడ వాహన సేవలో పాల్గొని భక్తులు మొక్కుకుంటే పిల్లలు లేనివారికి సంతానభాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు… అలాగే స్వామివారి కళ్యాణానికి అన్ని చోట్లా ముహూర్తం పెట్టి కళ్యాణం చేస్తే, ఇక్కడ మాత్రం గరుత్మంతుడు వచ్చి కళ్యాణమండపంపై మూడుసార్లు ప్రదక్షిణలు చేసిన తరువాతే తలంబ్రాలు పోసి పెళ్ళి తంతు ముగిస్తారని భక్తులు చెబుతున్నారు.

అగస్త్య మహర్షి ప్రతిష్టించిన ఆలయం ఇది… 1450 ఏళ్ల క్రితం అగస్త్య మహర్షి చదలవాడకు వచ్చిన క్రమంలో చదలవాడ శ్రీ రఘునాయక స్వామి ఆలయాన్ని ప్రతిష్టించారని చెబుతారు… అలాగే ఆలయ విమాన గోపుర కలశం క్రీస్తు శకం 461 సంవత్సరంలో ప్రతిష్ట జరిగినట్లుగా ఇక్కడి కలశంపై లిఖించబడి నేటికీ ఉంది… అలాగే ఇక్కడ కవిత్రయంలోని ఎర్రా ప్రగడ మహాకవి ఈ అలయంలోనే కూర్చొని మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారట… ఇన్ని విశేషాలు ఉన్న చదలవాడ శ్రీ రఘునాయకస్వామి కళ్యాణం రోజున గురుత్మంతుడి ఆగమనం ఇక చూసి తరలిచాల్సిందే… భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరిగిన రోజు ఉత్సవాలు ప్రారంభమై తొమ్మిదో రోజున స్వామివారికి కళ్యాణం నిర్వహిచడం ఇక్కడి ప్రత్యేకత… అంతేకాకుండా అన్ని రామాలయాల్లో సీతాదేవి రాములవారికి ఎడమవైపున కొలువుతీరి ఉంటే ఇక్కడ మాత్రం కుడివైపున కొలువుతీరి ఉండటం విశేషంగా చెబుతారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..  

ఇదేం చెత్త కామెంట్రీ భయ్యా.. అచ్చ తెలుగులో పంత్‌ను అలా అంటారా?
ఇదేం చెత్త కామెంట్రీ భయ్యా.. అచ్చ తెలుగులో పంత్‌ను అలా అంటారా?
ప్రకృతి విపత్తు వేళ రైతన్నకు సాయంగా నిలబడ్డ పోలీస్ అన్నలు..
ప్రకృతి విపత్తు వేళ రైతన్నకు సాయంగా నిలబడ్డ పోలీస్ అన్నలు..
శభాష్ సృజన.. క్యాన్సర్‌తో పోరాడుతూనే ఇంటర్‌లో సత్తా చాటిన బాలిక
శభాష్ సృజన.. క్యాన్సర్‌తో పోరాడుతూనే ఇంటర్‌లో సత్తా చాటిన బాలిక
రాజ్ తరుణ్ అనుకుంటే కళ్యాణ్ రామ్ వచ్చేశాడు..
రాజ్ తరుణ్ అనుకుంటే కళ్యాణ్ రామ్ వచ్చేశాడు..
తెలంగాణంలో సరస్వతీ పుష్కరాల కోసం ప్రత్యేక యాప్
తెలంగాణంలో సరస్వతీ పుష్కరాల కోసం ప్రత్యేక యాప్
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే భవిష్యత్ కు ముప్పే
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే భవిష్యత్ కు ముప్పే
గ్రూప్‌-1పై రాజకీయ దుమారం.. ఆరోపణలపై టీజీపీఎస్సీ ఫుల్ క్లారిటీ..
గ్రూప్‌-1పై రాజకీయ దుమారం.. ఆరోపణలపై టీజీపీఎస్సీ ఫుల్ క్లారిటీ..
తల్లి, అక్కా క్రేజీ హీరోయిన్స్.. బ్రేక్ కోసం చూస్తోన్న చెల్లెలు
తల్లి, అక్కా క్రేజీ హీరోయిన్స్.. బ్రేక్ కోసం చూస్తోన్న చెల్లెలు
కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు మంజూరు
కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు మంజూరు
వీడు మగాడ్రా బుజ్జి.. తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డ్
వీడు మగాడ్రా బుజ్జి.. తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డ్