
అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం, కుండళేశ్వరం లో శ్రీ పార్వతీ కుండళేశ్వర ఆలయాల్లో ఆయోధ్య రాముడి కోసం తయారు చేసిన రాముడికి ప్రీతికరమైన శివ దనస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లోకాకళ్యాణార్ధం ఆయోధ్య రాముడి కోసం 13 కిలోల వెండి, ఒక కిలో బంగారంతో ఈ ధనుస్సు ను ప్రత్యేకంగా రూపొందించారు..
తొలుత మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న ధనస్సుకు ఆలయ సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వణధికారి మాచిరాజు లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో గ్రామస్థులు, భక్తులు, మేళతాళాల తో మంగళహారతుల తో ఘనంగా స్వాగతం పలికారు. 14 ఏండ్ల వనవాసానికి ప్రతీకగా 14 కిలోల బరువుతో రూపొందించి న ఈ ధనస్సు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలలో భక్తుల దర్శనార్ధం యాత్రను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఇందులో భాగంగా మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
స్వామి వారి మూలవిరాట్ వద్ద ధనుస్సుకు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ, బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ధనస్సు కు ప్రత్యేక పూజలు జరిపారు. కుండళేశ్వరంలో ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు..అయోధ్య రామ ధనస్సు కు పలు క్షేత్రాలలో ప్రత్యేక పూజలు జరిపి అయోధ్య రాముని చెంతకు చేర్చనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..