Cancelled Trains: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌.. 20 వరకు ఆ మార్గంలో పలు రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే

Railway News: నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులతో పాటు ఆపరేషనల్‌ సమస్యల దృష్ట్యా ఈనెల 20 వరకు గుంటూరు మీదగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది.

Cancelled Trains: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌.. 20 వరకు ఆ మార్గంలో పలు రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే
Cancelled Trains
Follow us
Basha Shek

|

Updated on: Sep 15, 2022 | 2:39 PM

Railway News: నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులతో పాటు ఆపరేషనల్‌ సమస్యల దృష్ట్యా ఈనెల 20 వరకు గుంటూరు మీదగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. విజయవాడ- కొండపల్లి మధ్యన మూడో రైలు మార్గం నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులు తుది దశకు చేరుకోవడంతో కొన్ని గూడ్స్‌ రైళ్లను మోటు మర్రి- విష్ణుపురం మార్గం మీదుగా నడికుడికి మళ్లిస్తున్నారు. దీంతో సుమారు ఆరు రోజుల పాటు ప్యాసింజర్‌ రైళ్లని రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దైన రైళ్ల వివరాలిలా ఉన్నాయి.

1. విజయవాడ- గుంటూరు (07783, 07628, 07464)

ఇవి కూడా చదవండి

2. గుంటూరు – తెనాలి(07887)

3. గుంటూరు – రేపల్లె (077 86)

4. రేపల్లె – తెనాలి(07873)

5. తెనాలి – గుంటూరు(07282)

6. గుంటూరు – విజయవాడ (07864, 07465)

7. తెనాలి – రేపల్లె (07888)

8. రేపల్లె -మార్కాపురం(07889)

9. మార్కాపురం -తెనాలి(07890)

10. తెనాలి – విజయవాడ(07630)

వీటితో పాటు కొన్ని రైళ్లను దారి మళ్లించారు. మాచర్ల – గుంటూరు ప్యాసింజర్‌ని నడికుడి వరకే నడపనున్నారు. ఇక ఇక విజయవాడ – మాచర్ల ప్యాసింజర్‌ని నడికుడి నుంచి మాచర్లకు నడుపుతారు. అలాగే మాచర్ల – విజయవాడ ప్యాసింజర్‌ని నడికుడి వరకే వెళ్లనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..