Indian Railways: విశాఖ, విజయవాడ, భీమవరం ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. ఈ రూట్లలో..!

ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్. విజవాడ డివిజన్ పరిధిలో మరోసారి భారీగా రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఇటీవల ఈ డివిజన్‌లో భారీగా రైళ్లు రద్దవుతున్నాయి. వివిధ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు..

Indian Railways: విశాఖ, విజయవాడ, భీమవరం ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. ఈ రూట్లలో..!

Edited By:

Updated on: Dec 14, 2023 | 1:01 PM

ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే ప్రయాణీకులకు ముఖ్య అలెర్ట్. విజవాడ డివిజన్ పరిధిలో మరోసారి భారీగా రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఇటీవల ఈ డివిజన్‌లో భారీగా రైళ్లు రద్దవుతున్నాయి. వివిధ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు.. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. తాజాగా మరోసారి నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు, పలు పాక్షికంగా రద్దు, కొన్ని దారి మళ్ళిస్తున్నట్లు విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 31 వరకు రైళ్లు రద్దయ్యాయి. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..

ఈ నెల 18 నుంచి 31 వరకు పూర్తిగా రద్దయిన రైళ్లు..

  • 17239/17240 – విశాఖపట్నం – గుంటూరు.

  • 17219/17220 – మచిలీపట్నం – విశాఖపట్నం.

  • 17239/17240 – గుంటూరు – విశాఖపట్నం.

  • 07977/07978 – విజయవాడ – బిట్రగుంట.

  • 17237/17238 – బిట్రగుంట – చెన్నై సెంట్రల్

  • 07279/07575 – విజయవాడ – తెనాలి

  • 07576/07500 – విజయవాడ – ఒంగోలు

  • 12743/12744 – విజయవాడ – గూడూరు

ఈ నెల 18 నుంచి 31 వరకు రామవరప్పాడు – విజయవాడ మధ్య పాక్షికంగా రద్దయిన రైళ్లు..

  • 07896/07869 – విజయవాడ – మచిలీపట్నం

  • 07866/07770 – మచిలీపట్నం – విజయవాడ

  • 07863 – నర్సాపూర్ – విజయవాడ

  • 07861 – విజయవాడ – నర్సాపూర్

  • 07283 – విజయవాడ – భీమవరం టౌన్

  • 07870 – మచిలీపట్నం – విజయవాడ

విజయవాడ నుంచి గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు జంక్షన్ మీదుగా దారి మళ్లించిన రైళ్లు..

  • 22643 – ఎర్నాకుళం – పాట్నా(ఈ నెల 18 నుంచి 25 వరకు)

  • 12756 – భావ్‌నగర్ – కాకినాడ పోర్టు(ఈ నెల 23 నుంచి 30 వరకు)

  • 12509 – బెంగళూరు – గౌహతి(ఈనెల 20,22,27,29 తేదీల్లో)

  • 13351 – ధన్‌బాద్ – అలిప్పి(ఈ నెల 18 నుంచి 31 వరకు)

  • 18637 – హతియా – బెంగళూరు(ఈ నెల 23,30 తేదీల్లో)

  • 12835 – హతియా-బెంగళూరు(ఈ నెల 19,24,26,31 తేదీల్లో)

  • 12889 – టాటా – బెంగళూరు(ఈ నెల 22,29 తేదీల్లో)

  • 18111 – టాటా – యశ్వంత్‌పూర్(ఈ నెల 21,28 తేదీల్లో)