Somuveerraju, Mudragada: కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత ముద్రగడతో భేటీ అయిన సోమువీర్రాజు.. రాష్ట్ర రాజకీయాలపై చర్చ

Somuveerraju, Mudragada: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో శనివారం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు భేటీ అయ్యారు...

Somuveerraju, Mudragada: కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత ముద్రగడతో భేటీ అయిన సోమువీర్రాజు.. రాష్ట్ర రాజకీయాలపై చర్చ
Follow us
Subhash Goud

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 16, 2021 | 3:58 PM

Somuveerraju, Mudragada: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో శనివారం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర పరిస్థితులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ… రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ముద్రగడకు వివరించానని అన్నారు. కుటుంబ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ-జనసేన కలిసి పని చేస్తుంది అని అన్నారు.

భవిష్యత్తులో మరింత మందిని కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తామని సోమువీర్రాజు అన్నారు. అయితే ముద్రగడ సేవలు పార్టీకి ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయని, ముద్రగడ బీజేపీలోకి వచ్చే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని సోమువీర్రాజు పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో ముఖ్య నేతలో భేటీ అవుతూ తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ.

Also Read: ABP-C Voter Survey: జాతీయ స్థాయిలో జగన్ మార్క్.. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వేలో మెరుగైన ర్యాంక్.. టాప్-5 సీఎంలు వీరే