Bengaluru Rave Party: ‘24 గంటల డెడ్‌లైన్.. బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
బెంగళూరు రేవ్ పార్టీ నెల్లూరులో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఉప్పూ, నిప్పుగా ఉండే సోమిరెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య మరోసారి సవాళ్లకు దారి తీసింది. రేవ్ పార్టీల కల్చర్ నీదా? నాదా? బ్లడ్ శాంపిల్స్ చెక్ చేద్దాం, ఎవరు మద్యం సేవిస్తారో తెలుస్తోంది అంటూ సోమిరెడ్డికి 24 గంటల డెడ్‌లైన్ పెట్టారు కాకాణి గోవర్ధన్.

బెంగళూరు రేవ్ పార్టీ నిషా ఇప్పుడు పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. నెల్లూరు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. బర్త్ డే పార్టీ కాస్తా రాజకీయ సవాళ్లకు తెరతీసింది. రేవ్ పార్టీ కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో జరిగిందన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలకు ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు మంత్రి. ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం.. ఎవరిది రేవ్ పార్టీ కల్చరో తేలుతుందని సవాల్ విసిరిన కాకాణి 24 గంటల డెడ్‌లైన్ విధించారు. కలర్ జిరాక్స్ తీయించుకొని ఎవరి కారుపైనో అంటించుకుంటే తన వాళ్లు అవుతారా అని ప్రశ్నించారు. రేవ్ పార్టీలో తానూ, తన వాళ్లూ ఉన్నారని ప్రచారం చేస్తున్నారు.. నిరూపించగలరా ప్రశ్నించారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆ పార్టీలో ఉన్న వాళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న కాకాణి.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. సప్తవ్యసనాలు సోమిరెడ్డికి ఉన్నాయన్న కాకాణి ఎన్నికల్లో నీతో పోటీ పడటం తన దురదృష్టమన్నారు.
మంత్రి వాదన ఇలా ఉంటే.. కాకాణి పేరుతో ఉన్న కారు రేవ్ పార్టీ దగ్గర ఎందుకుంది? కారు మంత్రికి చెందినది కాదనకుంటే కాకాణి పేరుతోనే స్టిక్కర్ ఎందుకు ఉందనేది సోమిరెడ్డి స్ట్రయిట్ క్వశ్చన్. అంతకు మించి మరో అడుగు ముందుకు వేసిన సోమిరెడ్డి.. కాకాణి కనుసన్నల్లోనే రేవ్‌పార్టీ జరిగిందని ఆరోపిస్తున్నారు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్‌హౌస్ నిర్వాహకుడు గోపాల్‌రెడ్డి కాకాణికి స్నేహితుడు కాదా అని ప్రశ్నిస్తున్నారు. జూన్ 4 తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి ఆధారాలు సమర్పించి విచారణ కోరుతానన్నారు.
వీడియో చూడండి..
బెంగళూరు రేవ్ పార్టీ సర్వేపల్లిలో సవాళ్లకు తెరతీసింది. ఓ వైపు ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రత్యర్థులు రేవ్ పార్టీపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మరి కాకాణి 24 గంటల డెడ్‌లైన్‌కు స్పందిస్తారా లేదా.. ఇదే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..