అది అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలోని ఏటీఎం సెంటర్.. ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసి ఎందుకు లోపలికి వెళ్ళాడు.. డబ్బులు డ్రా చేస్తుండగా శబ్దాలు వినిపించాయి.. ఏదో అనుకుని లైట్ తీసుకున్నాడు.. అయినా శబ్దాలు వస్తున్నాయి.. ఆ తరువాత వెంటనే పక్కకు తిరిగి చూసేసరికి.. ఒక్కసారిగా షాక్.. వెన్నులో వణుకు పుట్టింది… అడుగులు తడబడ్డాయి. ఎట్టకేలకు చెమటలు కక్కుకుని బయటికి వచ్చాడు. అసలేం జరిగిందంటే.. పాడేరు మెయిన్ రోడ్ లోని ఏటీఎం సెంటర్లో..నాగు పాము బుసలు కొట్టింది. ఓ వ్యక్తి.. డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్లోకి వెళ్ళాడు. అక్కడ డబ్బులు విత్ డ్రా చేస్తుండగా.. అతనికి ఏదో అనుమానం కలిగింది. శబ్దాలు కూడా వస్తున్నాయి. దీంతో ఏటీఎం సెంటర్లో అటు ఇటు చూసాడు. ఒక్కసారిగా పాము కనిపించడంతో పరుగులు పెడుతూ బయటకు వచ్చాడు. పెద్ద నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. ఏటీఎం సెంటర్లో ఆ నాగు పాము హల్చల్ చేసింది. వెంటనే స్థానికులకు చెప్పడంతో స్నేక్ క్యాచర్ వాసు కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. అత్యంత చాకచక్కంగా నాగుపామును పట్టుకున్నాడు. వాటర్ బాటిల్ లో బంధించాడు. అయినప్పటికీ ఆ నాగుపాము పైకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. వెంటనే.. అడవిలో ఆ నాగుపామును విడిచి పెట్టాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..