Python Dead: ఓ కొండచిలువ కొంతమంది చేపల కోసం వేసిన వలలో చిక్కుకున్న ఊపిరాడక మృతి చెందింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ద్వారకా తిరుమలో చెరువు వీధిలో చిన వెంకన్న స్వామి నృసింహ సాగరం ఉంది. నృసింహ సాగరంలో ప్రతి సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి రోజున చిన వెంకన్న స్వామివారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. అయితే నరసింహ సాగరంలో కొందరు చేపల కోసం వల పెట్టారు. ఆ ప్రదేశంలో తిరుగుతున్న 6 అడుగుల కొండచిలువ చేపలు తినేందుకు నృసింహ సాగరం లోకి వెళ్ళింది. వలలో పడ్డ చేపలను కడుపారా తిని వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా వల నుంచి బయటికి రాలేక నీటిలో ఊపిరాడక ప్రాణాలు విడిచింది. తెల్లవారిన తర్వాత వలను వేసిన జాలరి వెళ్లి వల చూస్తే అందులో మృతిచెందిన కొండచిలువ కనిపించింది. వెంటనే దాన్ని వలలో నుంచి తీసి చెరువు గట్టుపై ఉంచారు. అయితే ఇటీవల కాలంలో ద్వారకాతిరుమలలో నివాస ప్రాంతాల్లో కొండచిలువల సంచారం ఎక్కువైంది. దీంతో స్థానికులు ఎటువైపు నుంచి ప్రమాదం పొంచి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Staff Reporter : B. Ravi kumar
Also Read: మిర్చి ఎందుకు మంట, వేడిని పుట్టిస్తాయి తెలుసా..? నోరు మంట పుడితే నీరుకి బదులు వీటిని ఉపయోగించండి