Oxygen Concentrators: భవిష్యత్తులో ఎన్ని కోవిడ్ వేవ్‌లు వచ్చినా.. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ తెలిపారు. సింగపూర్ రెడ్ క్రాస్ సొసైటీ అందించిన రూ.3 కోట్ల విలువైన 100 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 20 వెంటిలేటర్లను, శుక్రవారం సీఎస్ తన క్యాంపు కార్యాలయంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎ. శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎకే. పరిడాలకు అందించారు. అమెరికాకు చెందిన నాటా, తానా, మలేషియా తెలుగు అసోసియేషన్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పిజీషియన్స్ తదితర వీటిని అందించారు. అయితే రెడ్‌క్రాస్ సొసైటీ 13 జిల్లాల్లో బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయబోతోందని డాక్టర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. వివిధ సహాయక సామాగ్రిని అందించడానికి ముందుకు వచ్చిన అశ్వినికుమార్ పరిదా ఎన్‌ఆర్‌ఐలకు కృతజ్ఞతలు తెలిపారు.