East Godavari: మీసాలతో జడ వెయ్యవచ్చు.. ఏంది సామి ఈ వయ్యారాల రొయ్య..!

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ హార్బర్ లో లాప్ స్టార్ రకానికి చెందిన భారీ రొయ్య లభ్యమయింది.

East Godavari:  మీసాలతో జడ వెయ్యవచ్చు.. ఏంది సామి ఈ వయ్యారాల రొయ్య..!
Big Prawn

Updated on: Dec 13, 2021 | 1:17 PM

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ హార్బర్ లో లాప్ స్టార్ రకానికి చెందిన భారీ రొయ్య లభ్యమయింది. ఈ భారీ రొయ్య సుమారు 800 గ్రాములు బరువు,పెద్ద పెద్ద మిసాలతో ఉండడంతో చూపరులు ఆసక్తిగా చూశారు. ఈ అరుదయిన రొయ్యను స్థానిక వ్యాపారులు 600 రూపాయలకు కోనుగోలు చేశారు. ఇలాంటి రొయ్యలు అరుదుగా పడతాయని…ఇలాంటివి తరచూ లభ్యమైతే తమ పంట పండినట్లే అంటున్నారు మత్స్యకారులు.  ఈ భారీ మీసాల రొయ్య విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మీసం మెలేస్తున్న ఏపీ రొయ్య…

 రొయ్యల ఉత్పత్తిలో ఏపీ దుమ్మురేపుతోంది. దేశంలోనే… రికార్డు సృష్టించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశ రొయ్యల ఉత్పత్తిలో ఏపీ 75.84% వాటాతో దూసుకుపోయినట్లు మెరైన్‌ ప్రోడక్టస్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ గతంలో వెల్లడించింది. 2020–21లో దేశవ్యాప్తంగా 8,43,633 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయితే… అందులో ఆంధ్రానుంచే 6,39,894 టన్నులు ఉత్పత్తి అయినట్లు వివరించింది. అందునా.. వనామి రకం రొయ్యలు అత్యధికంగా 6,34,672  టన్నులు ఉత్పత్తి అయ్యాయని, బ్లాక్‌ టైగర్‌ రొయ్యలు వాటా 5,222 టన్నులని వివరించారు. సముద్ర ఉత్పత్తుల్లో కూడా ఏపీ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Also Read: పోలీసులు వెళ్లేసరికి అంతా నిర్మానుష్యం.. అద్దం పగలగొట్టగా అస్సలు యవ్వారం.. షాక్

 బాలయ్య-చిరు మల్టిస్టారర్.. మైత్రి ప్రొడ్యూసర్స్ కీలక కామెంట్స్