Minister Roja: రోజాకు అసమ్మతి సెగ.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ జడ్పీటీసీలు ఆగ్రహం..
మంత్రి రోజాకు సొంత నియోజకవర్గం, సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తోంది. నగరి నియోజకవర్గ జడ్పీటీసీలు మంత్రిపై అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. చిత్తూరు ఉమ్మడి జిల్లా.. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం తర్వాత..
మంత్రి రోజాకు సొంత నియోజకవర్గం, సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తోంది. నగరి నియోజకవర్గ జడ్పీటీసీలు మంత్రిపై అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. చిత్తూరు ఉమ్మడి జిల్లా.. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం తర్వాత.. వడమాలపేట, నిండ్ర జడ్పీటీసీలు మురళీధర్ రెడ్డి, మల్లేశ్వరి మీడియాతో మాట్లాడారు. కక్ష సాధింపుతో మంత్రి రోజా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరుగుతున్న అన్యాయాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చైర్మన్‌ను నిలదీశామన్నారు వడమాలపేట, నిండ్ర జడ్పీటీసీలు.
మంత్రి రోజా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని చెప్పారు జెడ్పీటీసీలు. అభివృద్ధి పనులకు కేటాయించిన జడ్పీ నిధులకు ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా రోజా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. భవనాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు జడ్పీటీసీలకు కార్యాలయాలు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజాకు టిక్కెట్ ఇస్తే తాము పనిచేసే ప్రసక్తే లేదని, కొత్తవారికి అవకాశం ఇస్తేనే పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని జడ్పీటీసీలు తేల్చి చెబుతున్నారు.