AP News: కట్టెలు కొట్టేవారికి కనిపించిన ఊహించని దృశ్యం.. ఏంటని వెళ్లి చూడగా కళ్లు చెదిరే.!

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామం దగ్గర ఓ అందమైన అడవి మధ్యలో వెలిసిన మహిమ గల అమ్మవారు గుబ్బల మంగమ్మ.. చుట్టూ ఎతైన కొండలు.. కనువిందు చేస్తూ గలగల పారే సెలయేర్ల సవ్వడుల నడుమ ఆహ్లాదపరిచే ప్రాంతంలో అమ్మవారు కొలువై ఉన్నారు.

AP News: కట్టెలు కొట్టేవారికి కనిపించిన ఊహించని దృశ్యం.. ఏంటని వెళ్లి చూడగా కళ్లు చెదిరే.!
Representative Image
Follow us
B Ravi Kumar

| Edited By: Ravi Kiran

Updated on: Jan 24, 2024 | 1:30 PM

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామం దగ్గర ఓ అందమైన అడవి మధ్యలో వెలిసిన మహిమ గల అమ్మవారు గుబ్బల మంగమ్మ.. చుట్టూ ఎతైన కొండలు.. కనువిందు చేస్తూ గలగల పారే సెలయేర్ల సవ్వడుల నడుమ ఆహ్లాదపరిచే ప్రాంతంలో అమ్మవారు కొలువై ఉన్నారు. గుబ్బలు, గుబ్బలుగా ఉన్న గుహలో అమ్మవారు వెలిసి ఉండటంతో.. అక్కడి ఆ అమ్మవారి ఆలయం ‘గుబ్బల మంగమ్మ ఆలయం’గా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. అక్కడ రాతిగుహపై నుంచి నీరు నిత్యం వస్తుంటుంది. ఇదే భక్తులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇదంతా పశ్చిమ ఏజెన్సీలో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మీరు మరో ఇంటరెస్టింగ్ అంశం చదవబోతున్నారు. అదే చిన్న ట్విస్ట్.

సహజంగా కొన్ని చోట్ల కట్టిన దేవాలయాలు లాంటివే సేమ్ రూపం‌తో నిర్మిస్తూ ఉంటారు. అది మనుషులు కట్టేది కాబట్టి సహజమే.. కానీ ప్రకృతి ఎంత గొప్పదో చూడండి మరి. బుట్టాయిగూడెం మండలంలో ఉన్న గుబ్బల మంగమ్మ లాంటి సేమ్ టూ సేమ్ ప్రకృతి మలచిన ఆకారం కుక్కునూరు మండలం బర్లమడుగు గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఓ దట్టమైన అడవిలో కనిపిస్తుంది. ఇటీవల ఈ రాతిగుహ ప్రముఖంగా భక్తులను ఆకర్షిస్తుంది. ఈ గుహపై నుంచి సైతం నిత్యం నీరు పారుతూ ఉంటుంది. ఈ అమ్మవారికి గిరిజనులు తరచుగా పూజలు నిర్వహిస్తుంటారు. బర్లమడుగు నుంచి వెళ్లాలంటే.. ద్విచక్ర వాహనంతోనే సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్న గుబ్బల మంగమ్మ ఇప్పుడిప్పుడే ఫేమస్ కావటంతో భక్తులు రాక క్రమక్రమంగా పెరుగుతోంది. బుట్టాయిగూడెంలో ఉన్న గుబ్బల మంగమ్మ కుక్కునూరు ఏజెన్సీలో ఉన్న గుబ్బల మంగమ్మ సేమ్ టూ సేమ్ ఉండటం ఓ ప్రకృతి వింతగా అందరూ భావిస్తున్నారు.