ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. మాయమాటలు చెప్పి.. పక్కకు తీసుకెళ్లి

సమాజంలో చిన్నారులు, యువతులు, మహిళలపై నేరాలు రోజురోజుకు పెరుగిపోతున్నాయి. లైంగిక దాడులు(Sexual Attacks), అత్యాచారాలకు(Rape) ఆడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వీటిని నియంత్రించేందుకు...

ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. మాయమాటలు చెప్పి.. పక్కకు తీసుకెళ్లి
Girl Harassment
Follow us
Ganesh Mudavath

| Edited By: Anil kumar poka

Updated on: Mar 11, 2022 | 3:53 PM

సమాజంలో చిన్నారులు, యువతులు, మహిళలపై నేరాలు రోజురోజుకు పెరుగిపోతున్నాయి. లైంగిక దాడులు(Sexual Attacks), అత్యాచారాలకు(Rape) ఆడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా.. కొందరు ప్రబుద్ధులు వాటిని పట్టించుకోవడం లేదు. వయసు భేదం మరించి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. చిన్నారులపై లైంగిక దాడులు, అత్యాచారానికి పాల్పడి వారి బంగారు భవిష్యత్ ను అంధకారంలో పడేస్తున్నారు. కామాంధుల చేతికి చిక్కి చిన్నారులు విలవిల్లాడిపోతున్నారు. తాజాగా విజయవాడ(Viajayawada) సమీపంలో ఏడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా మాయమాటలు చెప్పి బలాత్కరించాడు. కూతురు ముభావంగా ఉండటాన్ని గమనించిన తల్లి.. ఏం జరిగిందని వాకబు చేయగా అసలు విషయం బయటపడింది. వెంటనే బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కృష్ణా జిల్లా విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామంలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. ఏడేళ్ల వయసున్న రెండో కుమార్తె.. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లిన బాలిక.. ఇంటికి వచ్చే సమయంలో నీరసంగా ఉండటాన్ని చిన్నారి తల్లి గమనించింది. ఏమైందని అడగగా భయంతో వణికిపోయింది. విషయం పై లోతుగా ఆరా తీస్తే వారికి భయంకరమైన నిజాలు తెలిశాయి. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో.. ఓ వ్యక్తి తనను దుకాణానికి తీసుకెళ్లి ఇబ్బంది పెట్టాడని బాలిక తన తల్లికి తెలిపింది. కూతురి మాటలు విని తల్లి నిశ్చేష్ఠురాలైంది. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురిపై అత్యాచారనికి పాల్పడిన అనిల్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిపై పోక్సో యాక్టు ప్రకారం కేసులు నమోదు చేశారు.

Also Read

Russia Ukraine War Live: ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దండయాత్ర.. విస్తరిస్తున్న పుతిన్‌ యుద్ధోన్మాదం

కల్తీ దందా గుట్టు రట్టు.. అధికారుల దాడులు.. భారీగా సరకు పట్టివేత

తల్లితో కలిసి కచా బాదం పాటకు కాలు కదిపిన చాహల్‌ సతీమణి.. వీడియో