AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆ ప్రాంతంలో కరుణించని వాన.. సాగునీరు లేక తల్లడిల్లిపోతున్న రైతులు..

వాన చుక్క రాలదు. కాలువలో  నీరు పారదు. కళ్ల ముందే సాగు చేస్తున్న పైరు ఎండిపోతుంటే ఆకాశం వైపు చూపు నిలవదు. సాగు తప్ప మరోటి తెలియని అన్నదాతల వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగునీటి కోసం నిరీక్షిస్తున్నాడు. వాన దేవుడు కరుణించకపోతాడా... కాలువలో ఒక్క తడికైనా నీరు రాకపోతుందా అన్న ఆశతో జీవనం సాగిస్తున్నాడు. పల్నాడు ప్రాంతంతో పాటు గుంటూరు జిల్లాలోనూ సాగు నీటి కొరత నెలకొంది. ఈ ఏడాది గుంటూరు జిల్లాలో తీవ్ర సాగు నీటి ఎద్దడి నెలకొంది.

Andhra Pradesh: ఆ ప్రాంతంలో కరుణించని వాన.. సాగునీరు లేక తల్లడిల్లిపోతున్న రైతులు..
Dry Crop
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 02, 2023 | 6:44 PM

Share

వాన చుక్క రాలదు. కాలువలో  నీరు పారదు. కళ్ల ముందే సాగు చేస్తున్న పైరు ఎండిపోతుంటే ఆకాశం వైపు చూపు నిలవదు. సాగు తప్ప మరోటి తెలియని అన్నదాతల వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగునీటి కోసం నిరీక్షిస్తున్నాడు. వాన దేవుడు కరుణించకపోతాడా… కాలువలో ఒక్క తడికైనా నీరు రాకపోతుందా అన్న ఆశతో జీవనం సాగిస్తున్నాడు. పల్నాడు ప్రాంతంతో పాటు గుంటూరు జిల్లాలోనూ సాగు నీటి కొరత నెలకొంది. ఈ ఏడాది గుంటూరు జిల్లాలో తీవ్ర సాగు నీటి ఎద్దడి నెలకొంది. వర్షాలు సకాలంలో రాకపోవడం ఒక వైపు ప్రాజెక్టుల్లో నీరు చేరకపోవడంతో పంటలు సాగు చేసేందుకు అవసరమైన నీరు అందటం లేదు. దీంతో కొద్దిపాటి వర్షానికి సాగు మొదలు పెట్టిన రైతన్నలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు.

గుంటూరు జిల్లాలోని కృష్ణా పశ్చిమ డెల్టాలో యాభై ఐదు వేల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి కృష్ణా పశ్చిమ కెనాల్ ద్వారా సాగునీరు గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతానికి అందుతుంది. పశ్చిమ కాలువను పదివేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. అయితే ప్రతి ఏటా ఆరు వేల నుండి ఏడు వేల క్యూసెక్కుల నీటిని ఈ సీజన్ లో వదులుతారు. దీంతో తగినంత నీరు ఉండి రైతులు తమ పంటలు సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం నాలుగు వేల క్యూసెక్కుల నీరు మాత్రమే పశ్చిమ కాలువకు విడుదల చేస్తున్నారు. దీంతో తెనాలి రూరల్ మండలంలోని బ్రాంచ్ కెనాల్ కింద సాగవుతున్న భూములకు నీరు అందటం లేదు.

ఇప్పటికే ఎకరానికి కౌలు కాకుండా పదివేల రూపాయల పెట్టుబడి పెట్టిన రైతన్నలు పంటను రక్షించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంజన్లు, మోటార్ల ద్వారా నీళ్లను పంటలకు మళ్లిస్తున్నారు. కాలువలపై ఉన్న మోటార్లు నడవటానికి అవసరమైన విద్యుత్ కూడా లేకపోవడంతో ఇంజన్లనే నమ్ముకుంటున్నారు. అయితే వరి అత్యధికంగా సాగు చేస్తుండటంతో సకాలంలో అన్ని ఎకరాలను నీటిని పెట్టుకోలేకపోతున్నారు. మరో పది రోజుల్లో వర్షాలు లేకపోతో ఈ ఏడాది ఖరీఫ్ పంట పోయినట్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మినుము, పెసర వంటి పంటలను జనవరి తర్వాతే సాగు చేసే అవకాశం ఉంటందంటున్నారు. దీంతో వేసిన పంటను ఎలాగైనా రక్షించుకోవాలన్న తపనతో పొలం గట్లపైనే రైతన్నలు కాలం వెళ్లదీస్తున్నారు. వర్షాలు లేక పంటలపై ఆధారపడ్డ రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సాగు నీటి కరువుతో పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..