కాలగమనంలో ఎన్నో రోజులు వస్తుంటాయి. పోతుంటాయి. కొన్ని మాత్రమే హిస్టరీలో నిలిచిపోతాయి. ప్రత్యేక పేజీ లిఖించుకుంటాయి. సెప్టెంబర్-02 కూడా అలాంటిదే.
వైఎస్సార్ వర్థంతి
వైఎస్సార్ మరణించి నేటితో 12 ఏళ్లు అయ్యింది. ఇడుపులపాయలో ఎప్పటి మాదిరిగానే వర్ధంతి కార్యక్రమం జరిగింది. జగన్, షర్మిల మధ్య గ్యాప్ పెరగడం, షర్మిల ప్రత్యేక పార్టీ పెట్టడం వంటి కారణాలతో ఈ సారి అందరి ఫోకస్ పడింది. జులై 8న వైఎస్సార్ జయంతి రోజు ఇద్దరూ ఇడుపులపాయకు వెళ్లారు. కానీ వేర్వేరుగా వెళ్లారు. వర్థంతి రోజు మాత్రం పక్కపక్కనే కూర్చున్నారు. వైఎస్సార్ కుటుంబంగా కనిపించారు. ఇద్దరూ ప్రత్యేకంగా ట్వీట్లు చేశారు. తండ్రిని గుర్తుచేసుకున్నారు. ఒంటరినంటూ షర్మిల కాస్త ఎమోషనల్ అయ్యారు.
HICCలో వెఎస్సార్ సంస్మరణ సభ
HICCలో వెఎస్సార్ సంస్మరణ సభ జరుగుతోంది. జనరల్‌గా అయితే ఇది ఓ ప్రైవేట్ కార్యక్రమం. కానీ ప్రస్తుత పొలిటికల్ సిట్యుయేషన్ కారణంగా ఎక్కడలేని ప్రాధాన్యత. ఎవరు హాజరవుతారు.? ఎవరు దూరంగా ఉంటారన్నది పక్కన పెడితే..12 ఏళ్ల తర్వాత సంస్మరణ సభ ఏర్పాటు చేయడం… YS సన్నిహితులు, అప్పటి మంత్రులకు ఆహ్వానాలు పంపడం ఇంట్రెస్ట్‌గా మారింది. అందులోనూ ఈ మీటింగ్‌లో షర్మిల యాక్టివ్ రోల్ పోషించడం..జగన్ దూరంగా ఉండటం ఇలా ఎన్నో ఇష్యూస్. ఇది కేవలం ఆత్మీయ సభే అని పైకి చెబుతున్నా పొలిటికల్ వాసనలు గట్టిగానే ఉన్నాయన్న వాదనా ఉంది.
ఢిల్లీ గడ్డపై గులాబీ గుబాళింపు…
ఢిల్లీ గడ్డపై గులాబీ గుబాళించింది. టీఆర్‌ఎస్ భవన్ నిర్మాణానికి పునాదిరాయి ఘనంగా పడింది. ఉద్యమపార్టీ TRS విజయ ప్రస్థానంలో మరో అద్భుత విజయంగా నిలిచింది. పార్టీ ఆవిర్భవించిన 20 ఏళ్ల తర్వాత హస్తినలో పార్టీ ఆఫీసు నిర్మాణానికి తొలిఅడుగు పడింది.. ఎన్నాళ్లుగానో వేచిన ఉదయం అద్భుతంగా ఆవిష్కృతమైంది. వసంత్ విహార్ వేదమంత్రోచ్ఛారణతో మురిసిపోయింది. ముహూర్త సమయానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు సీఎం కేసీఆర్. ఏడాది తిరిగేలోగా ఫార్టీ ఆఫీస్ నిర్మాణం కంప్లీట్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.
పవన్ కల్యాణ్ బర్త్ డే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే నేడు. రెండు రాష్ట్రాల్లోనూ ఓ రేంజ్‌లో రీసౌండ్ వచ్చింది. మూవీ టీమ్స్ కూడా పవర్ స్టార్‌ను గ్రాండ్‌గా విష్ చేశాయి. భీమ్లానాయక్ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ అయ్యింది. జనసేనాని ఈ మధ్య యాక్టివ్ పాలిటిక్స్‌కు కాస్త గ్యాప్ ఇచ్చాడు. సినిమాల్లో బిజీ అయిపోయాడు. అయితే బర్త్‌డేకు జస్ట్ వన్‌డే బిఫోర్ వైసీపీ సర్కారుకు ఓ కౌంటర్ ఇచ్చాడు. అడుగుకో గుంత..గజానికో గొయ్యి..! ఇదేనా మీ పాలన అంటూ లేఖాస్త్రం సంధించారు. మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ కావడంతో ఈ బర్త్‌డే పార్టీ శ్రేణులు..ఫ్యాన్స్‌కి స్పెషల్‌గా మారింది..
నందమూరి హరికృష్ణ జయంతి
అన్న ఎన్టీఆర్ తనయుడు, చైతన్య రథ సారథి.. తెలుగు జాతి అన్నా, తెలుగు భాష అన్నా.. విపరీతమైన అభిమానం ప్రదర్శించే నందమూరి హరికృష్ణ జయంతి నేడు. ఈ క్రమంలో ఆయన తనయులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తండ్రిని స్మరించుకున్నారు. ఆయన తమ జీవితాల్లో చేసిన మేలును గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. అటు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా హరికృష్ణకు నివాళి ఘటించారు
Also Read: దేశంలో ఇంకా ముగియని సెకండ్ వేవ్.. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో మాత్రం రికార్డ్.. కీలక వివరాలు
బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం.. తెల్లారి నిద్రలేచి చూసేసరికి మైండ్ బ్లాంక్