Viveka Murder Case: వైఎస్‌ వివేకాను అందుకే హత్య చేశారు.. భాస్కర్ రెడ్డి తరపు లాయర్ సంచలన ఆరోపణలు

|

Apr 11, 2023 | 7:41 PM

వివేకా హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా హైకోర్టులో కొత్త వాదనలు వినిపించారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి..వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి తరఫు న్యాయవాది. అసలు హత్యకు వైఎస్‌ వివేకా లైంగిక వేధింపులే కారణమన్నారు లాయర్‌. ఇదే ఇప్పుడు ఏపీలో సంచలనం రేకెత్తిస్తోంది.

Viveka Murder Case: వైఎస్‌ వివేకాను అందుకే హత్య చేశారు.. భాస్కర్ రెడ్డి తరపు లాయర్ సంచలన ఆరోపణలు
Ys Viveka Murder Case
Follow us on

వివేకా హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా హైకోర్టులో కొత్త వాదనలు వినిపించారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి..వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి తరఫు న్యాయవాది. అసలు హత్యకు వైఎస్‌ వివేకా లైంగిక వేధింపులే కారణమన్నారు లాయర్‌. ఇదే ఇప్పుడు ఏపీలో సంచలనం రేకెత్తిస్తోంది. భాస్కర్‌రెడ్డి పిటిషన్‌పై రెండు రోజుల పాటు విచారించిన కోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. వివేకా మర్డర్ కేసులో ఏ-4 నిందితుడు దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్‌ చేస్తూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ, సునీత కలిసిపోయి దస్తగిరి ని అప్రూవర్ గా మార్చారని ఆరోపించారు. టీడీపీ నేతలు సునీతతో కలిసి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలపై కుట్ర పన్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు. నిందితుడు దస్తగిరి బెయిల్‌ రద్దు చేయాలని కోరారు పిటిషనర్‌ తరఫు న్యాయవాది. సునీల్ యాదవ్ తల్లిపై వివేకా లైంగిక వేధింపులే హత్యకు కారణమని వాదించారు. దీంతో కక్షకట్టి సునీల్ యాదవే వివేకా హత్యకు కుట్రపన్నాడని కోర్టుకి తెలిపారు. రెండో భార్య కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించడంతో కుటుంబంలో విబేధాలు తలెత్తాయని కోర్టు ఎదుట వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు.

మరోవైపు ఈ కేసులో ఎస్పీ రాంసింగ్ వ్యవహారం పై సుప్రీం కోర్ట్ కి వెళ్లారు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ. రాంసింగ్ వ్యక్తి గతంగా టార్గెట్ చేసి తమను ఇరికిస్తున్నారని ఆరోపించారు. దీంతో దర్యాప్తు అధికారిని మార్చారు. ఇదే విషయంపై తెలంగాణ హైకోర్టు కొత్త సిట్ ఆర్డర్ కాపీ ఉందా అని ప్రశ్నించింది. నూతనంగా నియమించిన సీబీఐ సిట్ టీమ్ వివరాలు కోర్టుకి సమర్పించారు పిటిషనర్ తరపు న్యాయవాది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  క్లిక్ చేయండి..